అక్షరటుడే, వెబ్‌డెస్క్: GHMC | జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీగా అధికారులు బదిలీ (GHMC Officers Transfer) అయ్యారు. పలువురు అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్(GHMC Commissioner RV Karnan) ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం పలువురిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
బల్దియా పరిధిలో 27 మంది టౌన్ ప్లానింగ్ అధికారుల(Town planning officers) బదిలీలు చేశారు. అలాగే ఖాళీగా ఉన్న పోస్టింగ్‌లతో పాటు పలువురు ఏసీపీలు (ACP), సెక్షన్ ఆఫీసర్లకు(Section Officers) స్థానచలనం కలిగించారు. అంతేగాకుండా పలువురికి ప్రమోషన్ కూడా ఇచ్చారు. సెక్షన్ ఆఫీసర్లు గా ఉన్న పలువురికి ఏసీపీలుగా ప్రమోషన్స్ ఇచ్చారు.