అక్షరటుడే, ఇందూరు: SI Transfers | నిజామాబాద్ కమిషనరేట్‌లో (Nizamabad Commissionerate) భారీగా ఎస్సైల బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాసర జోన్–2 (Basara Zone-2) పరిధిలో మొత్తం 14 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో వీఆర్‌లో ఉన్న ఏడుగురికి స్టేషన్లలో పోస్టింగ్ ఇచ్చారు.
SI Transfers | వీఆర్‌లో ఉన్న ఏడుగురికి పోస్టింగ్
బదిలీల్లో భాగంగా నిజామాబాద్ వీఆర్‌లో పనిచేస్తున్న ఏడుగురికి స్టేషన్లలో పోస్టింగ్ ఇచ్చారు. మామిడిపల్లి కల్యాణిని సిరికొండ ఎస్‌హెచ్‌వోగా బదిలీ చేశారు. సీహెచ్ సుమలతను మోపాల్ ఎస్‌హెచ్‌వోగా నియమించారు. ముత్యాల రమను ఎస్‌హెచ్‌వోగా ట్రాన్స్ఫర్ చేశారు. కావల్ల శైలేందర్‌ను బాల్కొండ ఎస్‌హెచ్‌వోగా బదిలీ చేశారు. జాదవ్ సుహాసినిని మెండోరా ఎస్‌హెచ్‌వోగా నియమించారు. పడాల రాజేశ్వర్‌ను ఏర్గట్ల ఎస్‌హెచ్‌వోగా ట్రాన్స్ఫర్ చేశారు. కలమడుగు కిరణ్ పాల్‌ను నిజామాబాద్ మూడో టౌన్ సెకండ్ ఎస్సైగా నియమించారు.
SI Transfers | వీఆర్‌కు ఏడుగురి అటాచ్
సిరికొండ ఎస్‌హెచ్‌వోగా పనిచేస్తున్న ఎల్.రామ్‌ను నిజామాబాద్ వీఆర్‌కు అటాచ్ చేశారు. మోపాల్ ఎస్‌హెచ్‌వో సి.యాదగిరిని నిజామాబాద్ వీఆర్‌కు పంపించారు. అలాగే ఎడపల్లి ఎస్‌హెచ్‌వో వంశీ కృష్ణను నిజామాబాద్ వీఆర్‌కు పంపించారు. బాల్కొండ ఎస్‌హెచ్‌వో నరేశ్‌ను ఆదిలాబాద్ వీఆర్‌కు అటాచ్ చేశారు. మెండోరా ఎస్‌హెచ్‌వో యాసిర్ అరాఫత్‌ను నిజామాబాద్ వీఆర్‌కు పంపించారు. ఏర్గట్ల ఎస్‌హెచ్‌వో బి.రామును నిజామాబాద్ వీఆర్‌కు పంపించారు. అంతేకాకుండా మోర్తాడ్ ఎస్‌హెచ్‌వో విక్రమ్‌ను ఆదిలాబాద్ వీఆర్‌కు అటాచ్ చేశారు.
కాగా.. కామారెడ్డి జిల్లాలోనూ పది మంది ఎస్సైలను ఇటీవల బదిలీ చేసిన విషయం తెలిసిందే.