అక్షరటుడే, కామారెడ్డి: SI transfers | కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) భారీగా ఎస్సైల బదిలీలు నిర్వహించారు. మొత్తం పది మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. బదిలీలపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (District SP Rajesh Chandra) తన మార్కు చూపించినట్లుగా తెలుస్తోంది.
SI transfers | వీఆర్‌లో ఉన్న నలుగురికి పోస్టింగ్.. ఇద్దరు ఎస్సైలు వీఆర్‌కు..
బదిల్లీలో భాగంగా వీఆర్‌లో ఉన్న నలుగురికి పోస్టింగ్ ఇచ్చారు. అలాగే ఇద్దరు ఎస్సైలను వీఆర్‌కు పంపించారు. వీఆర్‌లో ఉన్న నవీన్ చంద్రను జుక్కల్‌కు (Jukkal) బదిలీ చేశారు. రాఘవేంద్రను నస్రుల్లాబాద్ ఎస్సైగా (Nasrullabad SI) నియమించారు. అరుణ్ కుమార్‌ను పెద్ద కొడప్గల్గా ఎస్సైగా ట్రాన్స్ఫర్ చేశారు. రాజారాంనకు కామారెడ్డి టౌన్ ఎస్ఐగా (Kamareddy Town SI) పోస్టింగ్ ఇచ్చారు.
నస్రుల్లాబాద్ ఎస్సై (Nasrullabad SI) పని చేసిన లావణ్యను రామారెడ్డికి బదిలీ చేశారు. రాజంపేట ఎస్సై పుష్పరాజ్‌ను సదాశివనగర్ ఎస్సైగా (Sadashivnagar SI) ట్రాన్స్ఫర్ చేశారు. సదాశివనగర్ ఎస్సై రంజిత్‌ను దేవునిపల్లి పీఎస్‌కు పంపించారు. జుక్కల్ ఎస్సై (Jukkal SI) భువనేశ్వర్‌ను దేవునిపల్లి-2 ఎస్సైగా బదిలీ చేశారు. కాగా.. దేవునిపల్లి ఎస్సై రాజు, పెద్ద కొడప్గల్ ఎస్సై మహేందర్‌ను వీఆర్‌కు పంపించారు.