అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPS Transfers | రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ (IPS)లను బదిలీ చేసింది. మొత్తం 32 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1997 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ దేవేంద్ర సింగ్ చౌహాన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పర్సనల్) గా బదిలీ అయ్యారు. హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పని చేస్తున్న 2009 బ్యాచ్‌కు చెందిన జె పరిమళ హనా నూతన్ జాకబ్ సీఐడీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమితులయ్యారు.
డాక్టర్ చేతన మైలబతుల(2013) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా ట్రాన్స్ఫర్ అయ్యారు. వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి (2013 బ్యాచ్), మహేశ్వరం జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా, మల్కాజ్గిరి డీసీపీ పద్మజ (2013) తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (పరిపాలన)గా నియమితులయ్యారు.
సీఐడీ విభాగంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పని చేస్తున్న పాటిల్ సంగ్రామసింగ్ గణపత్రరావు (2015) నాగర్ కర్నూల్ ఎస్పీగా బదిలీ అయ్యారు. అక్కడ పని చేస్తున్న గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ (2018) హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డిప్యూటీ కమిషనర్‌గా వచ్చారు. ఇలా మొత్తం 32 మంది అధికారులకు ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. పలువురు ఎస్పీలు, ఏఎస్పీలను సైతం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

