HomeతెలంగాణPolice transfers | రాష్ట్రంలో 44 మంది డీఎస్పీల బదిలీ

Police transfers | రాష్ట్రంలో 44 మంది డీఎస్పీల బదిలీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Police transfers | తెలంగాణ రాష్ట్రంలో ఏసీపీలు, డీఎస్పీలు బదిలీ (ACPs and DSPs transfers) అయ్యారు. మొత్తం 44 మంది డీఎస్పీలను ట్రాన్స్​ఫర్​ చేశారు. ఈ మేరకు డీజీపీ జితేందర్​ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే హైదరాబాద్​ (Hyderabad) జంటనగరాల్లో భారీగా ఏసీపీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వై.నాగేశ్వర రావు (ఏసీపీ సీసీఎస్​ సైబరాబాద్​), సంపత్​కుమార్​ (ఏసీపీ కమాండ్​ కంట్రోల్​ రాచకొండ), ఆకుల చంద్రశేఖర్​ (ట్రాఫిక్​ ఏసీపీ మహేశ్వరం)కు బదిలీ అయ్యారు.

కాగా.. రాష్ట్రంలో ఇటీవల పలువురు డీఎస్పీలు బదిలీ(DSP Transfers) అయ్యారు. 12 మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగిస్తూ డీజీపీ జితేందర్‌(DGP Jitender) ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా మల్టీ జోన్​ –1 పరిధిలో పలువురు ఇన్​స్పెక్టర్లు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాకుండా సుమారు 20 రోజుల క్రితం హైదరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో భారీగా పోలీసులను బదిలీ చేశారు. పది మంది ఇన్​స్పెక్టర్లతో పాటు 249 మంది సబ్​ ఇన్​స్పెక్టర్లను ట్రాన్స్​ఫర్​ చేశారు.