అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Gram Panchayat Elections | బోధన్ రెవెన్యూ డివిజన్లో (Bodhan Division) గురువారం జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు.
Gram Panchayat Elections | ప్రశాంతంగా ఓటు వేయాలి
ప్రజలందరూ ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సీపీ పేర్కొన్నారు. ముఖ్యంగా గొడవలు సృష్టించే వ్యక్తులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని పేర్కొన్నారు. ప్రజలు పోలీసు శాఖ పట్ల ఎంతో స్నేహ భావంతో నమ్మకంతో ఉంటారని, శాంతిభద్రతలకు సమస్య ఏర్పడితే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
Gram Panchayat Elections | 1,384 సిబ్బందితో భారీ బందోబస్తు
ఎన్నికల సందర్భంగా బందోబస్తుకు 1,384 మంది సిబ్బందితో భారీ ఏర్పాట్లు చేశామని సీపీ పేర్కొన్నారు. ఇద్దరు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 17 మంది సర్కిల్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, 71 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 74 మంది ఏఎస్సైలు, ఆర్ఎస్సైలు, 192 హెడ్కానిస్టేబుళ్లు, 789 కానిస్టేబుళ్లు, మహిళ కానిస్టేబుళ్లు, 233 హోంగార్డులు/మహిళా హోంగార్డులు బందోబస్తు విధుల్లో ఉంటారన్నారు.