అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Promotions in Health Department | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యారోగ్య శాఖలో భారీగా ప్రమోషన్లు కల్పించింది. ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా, 36 మందికి సివిల్ సర్జన్ వైద్యులుగా పదోన్నతి కల్పించింది.
వైద్యారోగ్య శాఖలో కొంతకాలంగా పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రమోషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ డైరెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న కృష్ణవేణి, శ్వేత మొంగా, మంజునాథ్ నాయక్‌కు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతి ఇచ్చింది. కృష్ణవేణిని హైదరాబాద్ (Hyderabad) డీఎంఈ జాయింట్ డైరెక్టర్‌గా, శ్వేతను మెడికల్ హెల్త్ సర్వీసెస్ బోర్డు (Medical Health Services Board) జాయింట్ డైరెక్టర్‌గా, మంజునాథ్ నాయక్‌ను నేషనల్ హెల్త్ మిషణ్ సీఐవోగా నియమించింది.
Promotions in Health Department | వారికి పోస్టింగ్‌లు
ప్రభుత్వం గతంలో డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ సర్జన్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించింది. 36 మందికి సివిల్ సర్జన్‌గా ప్రమోషన్ ఇచ్చింది. తాజాగా వారికి పోస్టింగ్ ఇచ్చింది. డి రవీందర్ గౌడ్‌కు కామారెడ్డి జీజీహెచ్‌లో సివిల్ సర్జన్‌గా పోస్టింగ్ ఇచ్చింది. మహ్మద్ ఇబ్రహీం– సరోజిని దేవి ఐ హాస్పిటల్, విజయ నిర్మల – కమిషనరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (CHFW) జాయింట్ డైరెక్టర్, ముదిలి వసంత– సంగారెడ్డి డీఎంహెచ్‌వో, అరుణ కుమార్ –CHFW జాయింట్ డైరెక్టర్, ఎస్ పద్మశ్రీ –CHFW జాయింట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇంకా పలువురికి సైతం పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
