Homeక్రైంLiquor seize | భారీగా మద్యం పట్టివేత.. ఎందుకో తెలుసా?

Liquor seize | భారీగా మద్యం పట్టివేత.. ఎందుకో తెలుసా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Liquor seize | ఎక్సైజ్​ అధికారులు భారీగా మద్యం స్వాధీనం Liquor seize చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ moinabadలో జరిగిన ఓ కార్యక్రమంలో రూ.4 లక్షల విలువైన నాన్-డ్యూటీ లిక్కర్ non duty liquor స్వాధీనం చేసుకున్నారు. మొయినాబాద్​లోని ఓ ఫామ్​హౌస్​లో జరిగిన ప్రైవేట్​ కార్యక్రమంలో నాన్​డ్యూటీ మద్యం వినియోగిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో శంషాబాద్ ఎక్సైజ్ డీటీఎఫ్​ అధికారులు మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. రూ.నాలుగు లక్షల విలువైన 52 నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Liquor seize | అనుమతి లేకుండానే..

ఈవెంట్​ నిర్వాహకులు మద్యం అందించడానికి అనుమతి పొందలేదని, తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆమోదించిన డ్యూటీ పెయిడ్ లిక్కర్‌కు బదులు నాన్​ డ్యూటీ లిక్కర్​​ ఉపయోగించారని అధికారులు తెలిపారు. ఢిల్లీ, గోవా నుంచి 50 బాటిళ్ల బ్లాక్ లేబుల్, 4 గోవా ఆధారిత మద్యం బాటిళ్లు మరియు ఇతర నాన్-డ్యూటీ మరియు డ్యూటీ పెయిడ్ బ్రాండ్‌లతో కూడిన విదేశీ మద్యం అనుమతి లేకుండా కొనుగోలు చేశారన్నారు. దీంతో ఈవెంట్​ నిర్వాహకులతో పాటు, ఫామ్​హౌస్​ యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ తెలిపారు.

Liquor seize | నాన్​ డ్యూటీ లిక్కర్​ అంటే..

నాన్ డ్యూటీ లిక్కర్ అంటే డ్యూటీ చెల్లించకుండా అక్రమంగా రాష్ట్రంలోకి తీసుకొచ్చిన మద్యం. రాష్ట్ర ప్రభుత్వాలకు మద్యం ప్రధాన ఆదాయ వనరు అయిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో పన్ను పొందే మద్యానికి బదులు ఇతర రాష్ట్రాల మద్యం విక్రయించడానికి అనుమతి లేదు. ఇలా ఇతర రాష్ట్రాలు, విదేశీ మద్యం అమ్మడం, కొనడం నేరం.

గోవా, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో తక్కువ ధరకు మద్యం దొరుకుతుంది. మన దగ్గర మద్యం ధరలు అధికంగా ఉంటాయి. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన వారు మద్యం తీసుకు వస్తుంటారు. అలా మద్యం తీసుకు రావడం కూడా నేరం. ఈ క్రమంలో నాన్​ డ్యూటీ మద్యం వినియోగించినందుకు మొయినాబాద్​లో ఎక్సైజ్​ అధికారులు దాడులు చేసి, కేసు నమోదు చేశారు.