అక్షరటుడే, భీమ్‌గల్: Balkonda constituency | బాల్కొండ నియోజకవర్గంలో పలువురు నాయకులు గురువారం కాంగ్రెస్‌లో (Congress party) చేరారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి (Mutyala Sunil Reddy) నాయకత్వంలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా వాడి గ్రామ (Wadi village) నూతన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Balkonda constituency | పార్టీలో చేరిన వారు వీరే..
వాడి గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన గోలి రమ్య, ఉప సర్పంచ్ గోలి లింబాద్రిలతో పాటు వార్డు మెంబర్లు రెడ్డొల్ల సౌజన్య, అంకం శ్రీధర్, బొమ్మెర మోహన్, గోలి మాధురిలు అధికారికంగా పార్టీలో చేరారు. వీరితో పాటు గ్రామ ముఖ్య నాయకులు దాస్, రాకేశ్, అనిల్, సీనియర్ నాయకులు మహేందర్, రమేశ్, సాయికృష్ణ, వేణు, మధు, అశోక్, నర్సయ్య, సతీశ్ తదితర నాయకులు పార్టీలో చేరారు.
Balkonda constituency | ఘనస్వాగతం పలికిన సునీల్ రెడ్డి..
హైదరాబాద్‌లోని (Hyderabad) సునీల్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ కండువా కప్పుకున్నారు. ముత్యాల సునీల్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనే నమ్మకంతోనే ఇతర పార్టీల నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకుని వాడి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్, పార్టీ ముఖ్య నేతలు చరణ్, రాజ్ ముత్యం తదితరులు పాల్గొన్నారు.
Balkonda constituency | ముప్కాల్ ప్రజాప్రతినిధుల చేరిక

Mupkal mandal | ముప్కాల్ ప్రజాప్రతినిధుల చేరిక
అక్షరటుడే, మెండోరా: Balkonda constituency | ముప్కాల్ మండలకేంద్రంలో ఇటీవల ఎన్నికైన ఉపసర్పంచ్ (Deputy Sarpanch), వార్డు సభ్యులు (ward members) గురువారం కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిన్నయ్య, వార్డు సభ్యులు సతీశ్, శ్రీధర్, మయూర్, కాంగ్రెస్ నాయకులు కొమ్ముల శ్రీనివాస్, ప్రశాంత్ రెడ్డి, గోపి, మల్లారెడ్డి, అరుణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.