అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indonesia | ఇండోనేషియాలో (Indonesia) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 280 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌకలో (Ship) మంటలు చెలరేగాయి. సముద్రం మధ్యలో ఉండగా.. ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలు రక్షించుకోడానికి సముద్రంలో దూకారు.
ఇండోనేషియాలోని తలీసే ద్వీపానికి సమీపంలో కేఎం బార్సిలోనా వీఏ పాసింజర్ షిప్‌లో ఆదివారం మంటలు చెలరేగాయి. నౌకలో ఒక్కసారిగా మంటలు అంటుకొని దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు సముద్రంలో దూకేశారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులను రక్షించాయి.
Indonesia | కొనసాగుతున్న సహాయక చర్యలు
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందగా.. 150 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదం తర్వాత ఏర్పడిన గందరగోళంలో కనీసం 18 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. చాలా మంది కాలిన గాయాలు పొగ పీల్చడంతో అస్వస్థతకు గురయ్యారని వివరించారు. నావికాదళం, నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ, కోస్ట్ గార్డ్, స్థానిక మత్స్యకారులు నౌక నుంచి ప్రయాణికుల కాపాడటానికి యత్నిస్తున్నారు. ఇండోనేషియాలో వేల సంఖ్యలో దీవులు ఉంటాయి. దీంతో అంతర్-ద్వీప రవాణా కోసం తరచుగా పడవలపై ఎక్కువగా ప్రజలు ఆధారపడతారు. ఈ క్రమంలో తాజాగా నౌకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
View this post on Instagram