అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabd City | నగరంలో భారీ అగ్నిప్రమాదం(Major Fire Accident) చోటు చేసుకుంది. ఆటో నగర్(Auto Nagar)లో ఈ ప్రమాదం సంభవించింది.
స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. అలాగే పక్కనే ఉన్న బీరువాలు తయారీ చేసే గోదాంలోకి మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పరమేశ్వర్ ఆధ్వర్యంలో రెండు ఫైర్ ఇంజన్లతో సుమారు పది మంది సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. ప్రమాదంలో రూ. 10 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శంకర్ తెలిపారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని చెప్పారు.