Homeజాతీయంkolkata | కోల్‌కతా బరాబజార్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల ధాటికి కుప్పకూలిన భ‌వ‌నం

kolkata | కోల్‌కతా బరాబజార్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల ధాటికి కుప్పకూలిన భ‌వ‌నం

కోల్‌కతా నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన బరాబజార్‌లో శనివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 5 గంటల సమయంలో 17 ఎజ్రా స్ట్రీట్‌లో ఉన్న ఓ ఎలక్ట్రికల్ గూడ్స్ దుకాణం రెండో అంతస్తులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: kolkata | కోల్‌కతా నగరంలోని (Kolkata City) అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన బరాబజార్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 5 గంటల సమయంలో 17 ఎజ్రా స్ట్రీట్‌లో ఉన్న ఓ ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్‌ రెండో అంతస్తులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి.

క్షణాల్లోనే మంటలు భవనమంతా వ్యాపించి భారీ ప్రమాదానికి దారితీశాయి. దుకాణంలో పెద్ద మొత్తంలో ఎలక్ట్రికల్ వస్తువులు నిల్వ ఉండటంతో, అవి వరుసగా భారీ శబ్దాలతో పేలిపోతూ పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. మంటలు పక్కనే ఉన్న మరో భవనానికి కూడా వ్యాపించడంతో ప్రమాదం ఇంకా విస్తరించింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా విద్యుత్ సామగ్రి నిల్వ కేంద్రాలే ఉండటం అగ్నిమాపక చర్యలకు పెద్ద అడ్డంకిగా మారింది. మంటల ధాటికి భవనం కుప్పకూలిపోయింది.

Kolkata | 17 ఫైర్‌ ఇంజిన్లు రంగంలోకి

అగ్నిప్రమాదం తీవ్రతను అంచనా వేసిన అగ్నిమాపక శాఖ (fire department) మొత్తం 17 ఫైర్‌ ఇంజిన్లను (Fire Engines) సంఘటన స్థలానికి పంపింది. మంటల్లో సిలిండర్లు కూడా పేలిపోతున్నాయన్న సమాచారం వెలుగులోకి రావడంతో భయాందోళన మరింత పెరిగింది. విద్యుత్ సామగ్రి కారణంగా మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో వాటిని అదుపులోకి తేవడం అగ్నిమాపక సిబ్బందికి కష్టసాధ్యమైంది. మంటలు పెరుగుతూ పోతుండ‌డం సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది. స్ట్రీట్‌కు రెండు వైపుల నుంచి నీటిని చల్లుతూ, మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది యత్నాలను కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం మంటల నియంత్రణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, నష్ట పరిమాణం ఇంకా వెల్లడికాలేదు. ఇటీవ‌ల జ‌రుగుతున్న వ‌రుస అగ్ని ప్ర‌మాదాలు (Fire Accidents) అంద‌రిని భ‌య‌బ్రాంతుల‌కి గురి చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో అధికారులు కూడా ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు.

Must Read
Related News