HomeUncategorizedMassive fire in a textile factory | దుస్తుల ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. ఓనర్...

Massive fire in a textile factory | దుస్తుల ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. ఓనర్ సహా ఎనిమిది మంది మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Massive fire in a textile factory : మహారాష్ట్ర(Maharashtra)లోని సోలాపూర్ జిల్లా(Solapur district)లో ఉన్న ఒక కర్మాగారంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారుb. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. సోలాపుర్ MIDCలోని అక్కల్‌కోట్ రోడ్డులో ఉన్న సెంట్రల్ టెక్స్‌టైల్ మిల్లు(Central Textile Mill)లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 3:45 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్(shortcircuit) వల్ల మంటలు చెలరేగి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మృతుల్లో ఫ్యాక్టరీ యజమాని హాజీ ఉస్మాన్ హసన్‌ భాయ్ మన్సూరి, అతని ఒకటిన్నర ఏళ్ల మనవడు సహా కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు, నలుగురు కార్మికులు ఉన్నారు. ఎగసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందికి సుమారు ఐదు గంటలు శ్రమించారు.

అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) స్పందించారు. ఈ మేరకు పీఎంవో(PMO) సోషల్ మీడియా(social media)లో పోస్ట్ చేసింది. “మహారాష్ట్రలోని సోలాపుర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు మమా ప్రగాఢ సంతాపం. మరణించిన వారి కుటుంబ సభ్యులకు PMNRF నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా(ex-gratia) ఇస్తాం. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఇస్తాం” అని మోదీ చెప్పినట్లు పీఎంవో ప్రకటించింది.

Must Read
Related News