అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fire Accident | కేరళలో (Kerala) భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. త్రిస్సూర్ రైల్వే స్టేషన్ (Thrissur railway station) పార్కింగ్‌లో మంటలు చెలరేగడంతో దాదాపు 200కు పైగా బైక్‌లు కాలిపోయాయి.
త్రిస్సూర్ రైల్వే స్టేషన్‌లోని బైక్ పార్కింగ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాట్‌ఫామ్ నంబర్ 2 పక్కనే ఉన్న పార్కింగ్ ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. ఉదయం 6:45 గంటలకు మంటలను స్థానికులు గమనించారు. అయితే వాహనాల్లో పెట్రోల్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పార్కింగ్ షెడ్లో 500 బైక్‌లు నిలిపే సామర్థ్యం ఉంది. ఆదివారం 400 వరకు ద్విచక్ర వాహనాలు ఉండగా.. మంటలకు 200 బండ్లు కాలిపోయాయి.
Fire Accident | వేగంగా వ్యాపించిన మంటలు
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. అర్ధ గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. పార్కింగ్ షెడ్లో మంటలు తీవ్రంగా చెలరేగి, సమీపంలోని ఒక చెట్టుకు కూడా వ్యాపించాయి. రైల్వే పార్కింగ్ అధికారుల నిర్లక్ష్యంతోనే మంటలు ఇంత పెద్ద ఎత్తున వ్యాపించాయని ఆరోపణలు వస్తున్నాయి. మొదట ఒక బైక్‌కు మంటలు అంటుకన్నట్లు స్థానికులు తెలిపారు. అనంతరం వేగంగా వ్యాపించాయన్నారు. పెద్ద ఎత్తున మంటలు, పొగతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.