అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi Blast | ఢిల్లీలో భారీ బాంబు పేలుడు (bomb blast) చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎర్రకోట సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు చోటు చేసుకోగా.. ఐదు కార్లు ధ్వంసమయ్యాయి.
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ (Red Fort Metro Station) గేట్ నంబర్ 1 సమీపంలో సోమవారం సాయంత్రం ఒక కారులో పేలుడు జరిగింది. దేశ రాజధానిలో పేలుడు చోటు చేసుకోవడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇది అత్యంత భద్రతా ప్రాంతంలో భయాందోళనలను రేకెత్తించింది. పేలుడు తర్వాత, మరో మూడు వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయని అధికారులు తెలిపారు.
ఢిల్లీ అగ్నిమాపక శాఖ సిబ్బంది (Delhi Fire Department staff) తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 6:55 గంటల ప్రాంతంలో పేలుడు చోటుచేసుకున్నట్లు వారికి ఫోన్ వచ్చింది. దీంతో ఏడు పైరింజన్లు, 15 అంబులెన్స్‌లు ఘటన స్థలానికి చేరుకున్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. ఈ సంఘటనలో కొంతమందికి గాయాలు అయ్యాయని తెలుస్తోంది. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయి, పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🚨🚨🇮🇳 Blast rocks area near Delhi’s Red Fort Metro Station
The fire reportedly damaged some vehicles. pic.twitter.com/b4BrLwAWFs
— Sputnik India (@Sputnik_India) November 10, 2025
