ePaper
More
    HomeతెలంగాణSangareddy | రియాక్ట‌ర్ పేలుడు ఘ‌ట‌న‌.. 37కు చేరిన మృతుల సంఖ్య‌.. నేడు పాశ‌మైలారంనకు సీఎం...

    Sangareddy | రియాక్ట‌ర్ పేలుడు ఘ‌ట‌న‌.. 37కు చేరిన మృతుల సంఖ్య‌.. నేడు పాశ‌మైలారంనకు సీఎం రేవంత్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sangareddy : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Patancheru) మండలం పాశమైలారం (Pashamilaram)లో ఉన్న సిగాచి రసాయన పరిశ్రమ(Sigachi chemical industry)లో సోమవారం భారీ పేలుడు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ పేలుడు మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రయింగ్ యూనిట్లో సంభవించింది. ఇప్పటివరకు 37 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నాలుగు మృతదేహాలు గుర్తించగా, మిగతావి గుర్తు తెలియని స్థితిలో ఉన్నాయి. మరికొంతమంది శకలాల కింద చిక్కుకొని ఉండే అవకాశముందని అనుమానిస్తున్నారు. మృతుల్లో చాలామంది బీహార్ Bihar, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని గుర్తించారు.

    Sangareddy : పెరుగుతున్న మృతుల సంఖ్య‌..

    గాయపడిన 35 మంది కార్మికులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటివరకు 26 మృతదేహాలు వెలికితీశారు. అందులో 4 మృతులను గుర్తించారు. ఇంకా 27 మంది గల్లంతయ్యారని, శకలాల కింద చిక్కి ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 31 మృతదేహాలు పటాన్‌చెరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉన్నాయని సమాచారం. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో సింగరేణి రెస్క్యూ టీం, NDRF, HEDRA, రెవెన్యూ మరియు పోలీసు విభాగాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. స్థానిక ఉన్నతాధికారులు ఘటనాస్థలిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

    సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మొత్తం 57 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు చేపడతామని తెలిపారు. బాధిత కుటుంబాలు రక్త నమూనా ఇచ్చేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. అలానే సమాచారం కోసం 08455 276155 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth Reddy ఈ రోజు (మంగళవారం) ఉదయం 9:30 గంటలకు పటాన్‌చెరులోని ధ్రువ హాస్పిటల్‌లో గాయపడిన కార్మికులను పరామర్శించనున్నారు. అనంతరం 10:15 గంటలకు పేలుడు జరిగిన పరిశ్రమ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. మరోవైపు బాధితులకు వేగంగా వైద్య సేవలు అందించాలని, సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి అని ప్ర‌ధాన మంత్రి ఆదేశించారు. ఈ సంఘటనపై మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి మరియు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

    More like this

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...