HomeతెలంగాణEncounter | కర్రెగుట్టలలో భారీ ఎన్​కౌంటర్​.. 28 మంది మావోయిస్టుల మృతి

Encounter | కర్రెగుట్టలలో భారీ ఎన్​కౌంటర్​.. 28 మంది మావోయిస్టుల మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : తెలంగాణ – ఛత్తీస్​గఢ్​ సరిహద్దులోని ములుగు(Mulugu) జిల్లా వెంకటాపురం సమీపంలో గల కర్రెగుట్ట(Karregutta)ల్లో భద్రతా బలగాల కూంబింగ్​ ఐదు రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్​ కర్రెగుట్టలు పేరుతో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి.

ఈ అడవుల్లో వెయ్యి మంది మావోయిస్టులు(Maoists) ఉన్నారనే సమాచారం మేరకు కూంబింగ్(combing)​ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌ వైపున అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్​కౌంటర్​(Encounter) చోటు చేసుకుంది. ఈ ఎన్​కౌంటర్​లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. కూంబింగ్‌ ఆపాలని ఇప్పటికే మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తాము చర్చలకు సిద్ధమని ప్రకటించారు.