అక్షరటుడే, వెబ్‌డెస్క్: earthquake in Afghanistan : దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ Afghanistan లో సోమవారం (సెప్టెంబరు 1) తెల్లవారుజామున భారీ భూకంపం చోటుచేసుకుంది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.0గా నమోదైంది.
ఈ భారీ భూకంపం వల్ల తొమ్మిది మంది చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనం. పదిహేను మంది తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు.
ఈ భూకంప ధాటికి భారత్‌తోపాటు పాకిస్తాన్ Afghanistan లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా భవనాలు కంపించటంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకి వచ్చి వీధుల్లో పరుగులు తీశారు.
earthquake in Afghanistan : ఇక్కడే భూకంపాలు..
భారత్, యురేషియా టెక్టోనిక్ ప్లేట్లు Eurasian tectonic plate ఒకదానిపై ఒకటి పేరుకుపోవడంతో హిమాలయాలు Himalayas ఏర్పడ్డాయి.
ఈ ప్రాంతంలో తరచూ ఈ ప్లేట్లు కదులుతుంటాయి. ఈ క్రమంలోనే ఈ హిమాలయన్ ప్రాంతాల్లో ఉన్న దేశాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.