HomeUncategorizedEarthquake | అలస్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Earthquake | అలస్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Earthquake | అమెరికా(America)లోని అలస్కాలో సోమవారం భారీ భూకంపం వచ్చింది. రిక్టార్​ స్కేల్​పై 6.2 తీవ్రతతో ఈ భూకంపం (Earthquake) సంభవించింది. భూ ఉపరితలం నుంచి 48 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ప్రభావంతో తీర ప్రాంతంలో సముద్రంలో అలల తాకిడి పెరిగింది. దీంతో అధికారులు సునామీ (Tsunami) హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు.

Earthquake | సురక్షిత ప్రాంతాలకు ప్రజలు

భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భూమిలోపల గల టెక్టానిక్ ప్లేట్లల్లో కదలికలతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (National Center for Seismology) తెలిపింది.

Earthquake | వరుస భూకంపాలు

అలస్కా(Alaska)లో వారం వ్యవధిలో రెండు భూకంపాలు చోటు చేసుకోవడం గమనార్హం. జులై 17న 7.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా.. అలాస్కా భూకంపాలు ఎక్కువగా చోటు చేసుకునే జోన్​లో ఉంది. అలాగే ఈ ప్రాంతంలో 130పైకి పైగా అగ్ని పర్వతాలు ఉన్నాయి. కాగా ఆదివారం రష్యాలో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. పసిఫిక్​ సముద్ర తీర ప్రాంతంలోని కమ్చట్కా దీవుల సమీపంలో రిక్కార్​ స్కేల్​పై 7.4 తీవ్రతతో భూమి కంపించింది. వరుస భూకంపాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Must Read
Related News