అక్షరటుడే,నిజామాబాద్ సిటీ : Nizamabad Municipal Elections | మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల్లో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు తమ భవిష్యత్ రాజకీయ అవకాశాలపై దృష్టి సారిస్తూ పార్టీలు మారుతున్నారు. చేరికలతో పార్టీల బలం పెరుగుతుండగా, స్థానిక రాజకీయాల్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది.
Nizamabad Municipal Elections | నగర బీఆర్ఎస్లోకి..
కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈగ చిన్నోళ్ల సాయిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 250మంది కార్యకర్తలు బీఆర్ఎస్ (BRS)లో చేరారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈగ సంజీవరెడ్డి (Eega Sanjeeva Reddy) సమక్షంలో వారంతా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Nizamabad Municipal Elections | పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుంటాం..
ఈ సందర్భంగా సాయి రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీలోకి ఆహ్వానించిన బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Govardhan)కు ఈగ సంజీవరెడ్డికి బీఆర్ఎస్ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో తమకు ఇచ్చిన బాధ్యతను బాధ్యతయుతంగా నెరవేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.