అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyber Fraud | సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కొందరు కేటుగాళ్లు ప్రజలను నమ్మించి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన ఓ డాక్టర్ ఏకంగా రూ.14 కోట్లు మోసపోయాడు.
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు అని ఆశ చూపి, డిజిటల్ అరెస్ట్‌ల (digital arrests) పేరిట భయపెట్టి ప్రజల నుంచి డబ్బులు లాగుతున్నారు. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా పలువురు మోసపోతునే ఉన్నారు. మోసపోయే వారులో బాగా చదువుకున్న వారు సైతం ఉండటం గమనార్హం. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ డాక్టర్‌ను సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు.
Cyber Fraud | పెట్టుబడుల పేరిట..
స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో సైబర్ కేటుగాళ్లు వైద్యుడిని మోసం చేశారు. అందమైన అమ్మాయి ఫొటో ఉన్న ఆకౌంట్తో సదరు డాక్టర్‌కు ఫేస్బుక్లో మెసెజ్ చేశారు. ఆమె తాను ఒంటరి మహిళనని ఆయనతో పరిచయం పెంచుకుంది. తాను ఓ కంపెనీలో పని చేస్తానని నమ్మించింది. స్టాక్ మార్కెట్ ద్వారా తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించింది. దీంతో సదరు వైద్యుడు తన ఇల్లు అమ్మి మరి రూ.14 కోట్లు మహిళ చెప్పిన అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేశాడు. అనంతరం మహిళ నుంచి స్పందన రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించిన వైద్యుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Cyber Fraud | కంబోడియా నుంచి..
కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్‌ను కంబోడియా నుంచి ట్రాప్ చేసినట్లు గుర్తించారు. సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు ఇచ్చిన భారత్‌లోని నలుగురిని అరెస్ట్ చేశారు. మ్యూల్ అకౌంట్లోకి వచ్చిన డబ్బులను అనంతరం కంబోడియాకు తరలించారు.