అక్షరటుడే, వెబ్డెస్క్ : US Visa | అమెరికా ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. ఇప్పటికే కొత్త వీసాల జారీకి సోషల్ మీడియా వెట్టింగ్ అమలు చేస్తున్న యూఎస్.. తాజగా పాత హెచ్–1బీ, హెచ్ –4 వీసాలను (H-1B and H-4 visas) సైతం భారీగా రద్దు చేసింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) వలసదారులపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కొత్తగా వీసాల జారీ చేసే సమయంలో దరఖాస్తుదారుల సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేస్తారు. వివాదాస్పద పోస్టులు పెడితే సదరు వ్యక్తి వీసా మంజురు చేయరు. ఇప్పటికే వెట్టింగ్ ప్రారంభించడంతో వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా పాత వీసాలను సైతం పెద్ద ఎత్తున రద్దు చేసింది.
US Visa | ప్రుడెన్షియల్ రద్దు
వెట్టింగ్ ప్రక్రియతో భారత్లో జరగాల్సిన వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. అయితే ఇప్పటికే అమెరికాలో పని చేస్తున్న హెచ్1బీ వీసా హెచ్4 వీసాదారులకు సైతం అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వారి తాత్కాలిక వర్కింగ్ వీసాల్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు వీసాలు రద్దు అయినట్లు ప్రభావిత వీసాదారులకు మెయిళ్లు వస్తున్నాయి. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ వీసాలను ఎక్కువగా భారత వృత్తి నిపుణులు తీసుకుంటారు. అయితే వీటిని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముందు జాగ్రత్తగా వీటిని రద్దు చేస్తున్నామని, తిరస్కరించడం లేదని తెలిపింది. తాత్కాలిక రద్దుతో ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న వారిపై ప్రభావం పడదని సమాచారం. వీసా గడువు ముగిసేవరకూ వారు అక్కడే ఉండొచ్చు.