అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ నగర శివారులో నార్కోటిక్ బృందం అధికారులు మంగళవారం దాడులు చేశారు.
నార్కోటిక్ సీఐ పూర్ణేశ్వర్ (Narcotic CI Purneswar) తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారులోని గుండారం (Gundaram) ప్రాంతంలో గల కల్లు డిపోలో నార్కోటిక్ సీఐ సిబ్బందితో కలిసి దాడులు చేశారు. కృత్రిమ కల్లు తయారీ కోసం ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన 600 గ్రాముల అల్ప్రాజోలం పట్టుకున్నారు. డిపో యజమాని రమేష్ గౌడ్, వాచ్‌మన్ అశోక్‌ను అరెస్ట్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం నిజామాబాద్ రూరల్ పోలీసుల (Nizamabad Rural Police)కు వారిని అప్పగించారు. అధికారుల దాడిలో పట్టుబడిన అల్ప్రాజోలం విలువ దాదాపు రూ.నాలుగు లక్షల వరకు ఉంటుందని సీఐ తెలిపారు.
