Homeజిల్లాలుకామారెడ్డిMassive additions to Congress | ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు..

Massive additions to Congress | ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు..

జుక్కల్ మండలం వజ్రఖండి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు రాంపటేల్, రాములు తదితరులు కాంగ్రెస్​ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో గురువారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని సాదరంగా ఆహ్వానించారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Massive additions to Congress | కామారెడ్డి జిల్లా జుక్కల్(Jukkal) మండలం వజ్రఖండి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు రాంపటేల్, రాములు తదితరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

జుక్కల్​ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (Mla Thota Laxmi Kantha Rao) సమక్షంలో గురువారం వీరంతా కాంగ్రెస్​ పార్టీలో చేరారు.

Massive additions to Congress | ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కండువా కప్పి

ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.

వజ్రఖండి గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామంలోని హనుమాన్ మందిర అభివృద్ధికి కూడా తోడ్పాటునందిస్తానని హామీ ఇచ్చారు.

ప్రజా ప్రభుత్వం విద్య, వ్యవసాయ, పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించి లబ్ధి చేకూర్చుతానన్నారు.

బీఆర్ఎస్ నాయకులు హన్మంతరావు పటేల్, సంతోష్ రెడ్డితో పాటు గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు సైతం పార్టీలో చేరారు.