అక్షరటుడే, కామారెడ్డి : Tahsildars Transfer | కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని పిట్లం తహశీల్దార్ రాజా నరేందర్ గౌడ్‌ను బాన్సువాడకు బదిలీ చేశారు. బాన్సువాడ తహశీల్దార్ వరప్రసాద్‌ను కామారెడ్డి కలెక్టరేట్ (Kamareddy Collectorate) సూపరిండెంట్‌గా పంపించారు. కలెక్టరేట్ సూపరిండెంట్ మహేందర్‌ను పిట్లం తహశీల్దార్‌గా నియమించారు. నిజాంసాగర్ తహశీల్దార్ భిక్షపతి పెద్దకొడప్గల్కు ట్రాన్స్ఫర్ చేశారు.
బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తూ పెద్ద కొడప్గల్ ఇన్‌ఛార్జి తహశీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న అనిల్ కుమార్‌ను ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయానికి బదిలీ చేశారు. ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో (Yellareddy RDO office) పనిచేస్తున్న సవాయి సింగ్‌ను బీర్కూర్ తహశీల్దార్‌గా నియమించారు. ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సాయి భుజంగరావును నిజాంసాగర్‌కు బదిలీ చేశారు.
కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న వసంతను బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి పంపించారు. భిక్కనూరు తహశీల్దార్ రోజా కామునిని బీబీపేటకు, రాజంపేట తహశీల్దార్ సంతోషిని భిక్కనూరుకు, బీబీపేట తహశీల్దార్ శృతిని రాజంపేటకు బదిలీ అయ్యారు. నాయబ్ తహశీల్దార్ భిక్షపతిని ఖాళీగా ఉన్న దోమకొండ నాయబ్ తహశీల్దార్‌గా బదిలీ చేశారు.
Tahsildars Transfer | ఏసీబీ దాడులు జరిగిన కొద్దిసేపట్లోనే..
నాగిరెడ్డిపేట తహశీల్దార్ శ్రీనివాస్ రావు ఏసీబీకి (ACB) పట్టుబడిన నేపథ్యంలో తాజాగా బదిలీలు జరగడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో పలువురు తహశీల్దార్లు అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తహశీల్దార్లను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.