అక్షరటుడే, కామారెడ్డి: Vande Mataram | వందేమాతర గీతం 150వ వసంతాలు (150th anniversary) పూర్తి చేసుకున్న సందర్భంగా ఉమ్మడి జిల్లాలో వందేమాతర గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సంస్థల్లో శుక్రవారం సామూహికంగా వందేమాతర (Vande Mataram) గేయాలాపన చేశారు.
కామారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో అదనపు కలెక్టర్ మదన్ మోహన్ (Additional Collector Madan Mohan), డిప్యూటీ కలెక్టర్ రవితేజ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని సామూహికంగా వందేమాతరం ఆలపించారు. ఈ సందర్భంగా అధికారులంతా దేశభక్తి, ఐక్యత, స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ గేయం భారత స్వాతంత్య్ర సమరంలో పోషించిన విశిష్ట పాత్రను స్మరించుకున్నారు.
Vande Mataram | నగరంలో కాకతీయ విద్యాసంస్థల ఆధ్వర్యంలో..
నిజామాబాద్ నగరంలోని (Nizamabad city) ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఎంపీ అర్వింద్ (MP Arvind), ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy) ఆధ్వర్యంలో విద్యార్థులు గీతాలాపన చేశారు. అంతకుముందు కాకతీయ విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు అంతా కలిసి పులాంగ్ చౌరస్తా చుట్టూ మానవహారం నిర్మించారు. అక్కడ వందేమాతర గీతాన్ని ఆలపించారు.
Vande Mataram | బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో..
బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో వందేమాతర గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub Collector Kiranmayi) ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కలిసి వందేమాతర గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో తహశీల్దార్ వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తదితరులు పాల్గొన్నారు.
Vande Mataram | బాల్కొండలో..
బాల్కొండ మండలంలోని (Balkonda mandal) అన్ని పాఠశాలల్లో సామూహిక వందేమాతర గీతాలాపన నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్, జెడ్పీ హైస్కూల్ బాల్కొండలో ఇన్‌ఛార్జి హెడ్మాస్టర్ ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Vande Mataram | ముప్కాల్‌లో..
వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీడీవో బి.రమేష్, కార్యాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Vande Mataram | బోధన్ మున్సిపాలిటీలో..
బోధన్ (Bodhan) మున్సిపాలిటీలో శుక్రవారం వందేమాతర గీతాలాపన చేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, సీనియర్ అసిస్టెంట్ శేఖర్ సంతోష్ పాల్గొన్నారు.
Vande Mataram | బాల్కొండలో..
బాల్కొండ మండల (Balkonda mandal) పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బందితో కలిసి ‘వందేమాతరం’ గీతాన్ని సామూహికంగా ఆలపించారు. కార్యక్రమం విజయవంతంగా సాగడానికి సహకరించిన అందరికీ ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Vande Mataram | ఆర్మూర్ మున్సిపాలిటీలో..
వందేమాతర గీతం రూపొందించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ శుక్రవారం వందేమాతర గీతాలాపన చేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, సీనియర్ అసిస్టెంట్ లయన్ శేఖర్, రాహుల్, చందు, భూమేశ్వర్ పాల్గొన్నారు.
Vande Mataram | కమ్మర్‌పల్లిలో..
కమ్మర్పల్లి మండల (Kammarpally Mandal) కేంద్రంలోని తహశీల్దార్ జి ప్రసాద్, సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రాజ శ్రీనివాస్, సిబ్బంది, ఎంఈవో కార్యాలయంలో ఎంఈవో ఆంధ్రయ్య, పోలీస్ స్టేషన్లో ఎస్సై అనిల్ రెడ్డి, సిబ్బంది, జూనియర్ కాలేజీలో అధ్యాపకులు మధు, గంగాధర్, శ్రీహరి, సుమతి, స్రవంతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ సాయన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వందేమాతరం సామూహిక గీతాలాపన చేశారు. మండల కేంద్రంలోని భరతమాత విగ్రహం దగ్గర వీడీసీ అధ్యక్షుడు రామస్వామి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాలెపు నర్సయ్య, శేఖర్, గ్రామస్థులు పాల్గొన్నారు.
![]()
