Homeజిల్లాలునిజామాబాద్​Karthika Masam | శివాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు

Karthika Masam | శివాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు

బోధన్​ పట్టణంలోని శివాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక మాసం సందర్భంగా మంగళవారం ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Karthika Masam | కార్తీక మాసంలో శివకేశవుల పూజలు చేయడం ప్రజలు విశేషంగా భావిస్తారు. బోధన్ శివాలయంలో (Bodhan Shiva Temple) ప్రతిరోజూ నిత్య పూజలు జరుగుతున్నాయి. ఈ పవిత్ర మాసంలో సత్యనారాయణ వ్రతాలు తులసి పూజలు చేస్తున్నారు.

దీంట్లో భాగంగా మంగళవారం శివాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు (Satyanarayana Vratas) జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ ఆధ్వర్యంలో వ్రతాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సుమారు 100 మంది జంటలు పాల్గొన్నాయి. వ్రతాల అనంతరం ఆలయ కమిటీ ద్వారా తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నామని ఆలయ ఏవో రాములు తెలిపారు. సాయంత్రం వేళ ప్రత్యేకంగా దీపారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.