Homeతాజావార్తలుMass Jathara Review | మాస్ జాత‌ర మూవీ రివ్యూ.. ర‌వితేజ ఖాతాలో హిట్ పడిందా,...

Mass Jathara Review | మాస్ జాత‌ర మూవీ రివ్యూ.. ర‌వితేజ ఖాతాలో హిట్ పడిందా, లేదా?

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), క్యూట్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) కాంబోలో రూపొందిన మాస్ ఎంటర్టైనర్‌ ‘ మాస్ జాతర’ నేడు రిలీజ్​ అయ్యింది. చిత్రం హిట్​ పడిందా లేదా తెలుసుకోండి..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Mass Jathara Review | మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), క్యూట్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) కాంబోలో రూపొందిన మాస్ ఎంటర్టైనర్‌ ‘ మాస్ జాతర’ (Mass Jathara). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో, భాను భోగవరపు తెర‌కెక్కించిన ఈ చిత్రం అక్టోబర్‌ 31న ప్రీమియ‌ర్స్ జ‌రుపుకుంది. ఈ క్ర‌మంలో మూవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌టకు వ‌చ్చాయి. ఈ సినిమాతో హిట్ కొడ‌తానన్న ర‌వితేజ త‌న ఖాతాలో మ‌రో విజ‌యం చేర్చుకున్నాడా అనేది చూద్దాం.

రవితేజ అంటేనే ఎనర్జీకి మరో పేరు. ‘మాస్ జాతర’లో కూడా ఆ ఎనర్జీ ఓ లెవెల్‌లోనే ఉంది. కానీ కథ మాత్రం మనం ఎన్నోసార్లు చూసిన దారిలోనే నడుస్తుంది. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, రవితేజ కెరీర్‌లో 75వది కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూశారు. అయితే ఆ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుందనే ప్రశ్నకు సమాధానం కొంచెం మిశ్రమంగా ఉంది.

Mass Jathara Review | కథ..

లక్ష్మణ్ భేరి (రవితేజ) వరంగల్‌కు చెందిన రైల్వే పోలీస్. అతని తాత (రాజేంద్ర ప్రసాద్) పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడల్లా వాటిని చెడగొడుతూ ఉంటాడు. ఓ మినిస్టర్‌తో తగాదా కారణంగా అతను ట్రాన్స్‌ఫర్ అయ్యి శ్రీకాకుళంలోని అడవి వరం అనే గ్రామానికి చేరుతాడు. అక్కడ శివుడు (నవీన్ చంద్ర) రైతుల ద్వారా గంజాయి పండించి అమ్ముతూ ఉంటాడు. ఆ ఊర్లో జరుగుతున్న అక్రమాలపై లక్ష్మణ్ రెచ్చిపోతాడు కానీ అతని అధికార పరిధి రైల్వే స్టేషన్ వరకే. శివుడి గంజాయి సరుకు అనుకోకుండా ఓ గూడ్స్ ట్రైన్​లో ల‌క్ష్మ‌ణ్‌ స్టేష‌న్‌కి వ‌స్తుంది. అయితే ఆ స‌రుకును ల‌క్ష్మ‌ణ్ ఎక్క‌డ దాచాడు ? లక్ష్మణ్ అసలు రైల్వే పోలీస్ ఎందుకయ్యాడు? శివుడు – లక్ష్మణ్ మధ్య విబేధాలు ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

Mass Jathara Review | నటీనటులు ఎలా చేశారు?

రవితేజ ఎప్పటిలాగే ఎనర్జీతో స్క్రీన్‌ను నింపేశాడు. యాక్షన్ సీక్వెన్స్‌లు, డ్యాన్స్‌లు, డైలాగ్ డెలివరీ – అన్నీ ఫుల్ జోష్‌లో ఉన్నాయి. శ్రీలీల రెండు వేరియేషన్లలో కనిపించి గ్లామర్‌తో పాటు ఎమోషన్ కూడా బాగా పండించింది. నవీన్ చంద్ర విలన్‌గా ఇంప్రెస్ చేశాడు. రాజేంద్ర ప్రసాద్ పాత్ర చిన్నదైనా క్యూట్ టచ్ ఇచ్చింది. హైపర్ ఆది, అజయ్ ఘోష్ కామెడీ సీన్స్ కొన్ని బాగానే నవ్విస్తాయి.న‌టీన‌టులు అంద‌రు కూడా త‌మ ప‌రిధిలో న‌టించి అల‌రించారు.

Mass Jathara Review | టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్

సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ఫ్రేమ్‌లు కలర్‌ఫుల్‌గా క‌నిపిస్తాయి. భీమ్స్ మ్యూజిక్‌లో “తు మేరీ లవర్” సాంగ్ మాత్రమే ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాల్లో మ‌రీ ఎక్కువైంది. మాస్ ఎలివేష‌న్ కోసం డ్ర‌మ్స్ ప‌గిలేలా కొట్టిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. ఎడిటింగ్ కాస్త టైట్‌గా ఉంటే సినిమా మరింత క్రిస్ప్‌గా అనిపించేది. యాక్షన్ సన్నివేశాలు మాత్రం డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. భాను డైరెక్షన్ స్ట్రైట్‌గా ఉన్నా, స్క్రీన్‌ప్లే కొత్తదనం లేకుండా సాగుతుంది. రైతులు గంజాయి ఎందుకు పండిస్తున్నారనే పాయింట్‌లో లోతు ఉంటే కథ బలంగా ఉండేది. నిర్మాణ విలువ‌లు బాగానే ఉన్నాయి.

  • నటీనటులు: రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్రవీణ్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, అజయ్ ఘోష్, నవ్య స్వామి తదితరులు
  • రచన, దర్వకత్వం: భాను భోగవరపు
  • డైలాగ్స్: నందూ సావిరిగణ
  • నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
  • సినిమాటోగ్రఫి: విధూ అయ్యన్న
  • ఎడిటింగ్: నవీన్ నూలీ
  • మ్యూజిక్: భీమ్స్ సిసిరిలియో
  • బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్
Must Read
Related News