Homeబిజినెస్​Maruti e Vitara | మారుతినుంచి ఎలక్ట్రిక్‌ కారు.. అమ్మకాలు ఎప్పటినుంచి అంటే..

Maruti e Vitara | మారుతినుంచి ఎలక్ట్రిక్‌ కారు.. అమ్మకాలు ఎప్పటినుంచి అంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Maruti e Vitara |మారుతి సుజుకీ(Maruti suzuki) సంస్థ తొలి ఎలక్ట్రిక్‌ కారు(Electric car)ను తీసుకువస్తోంది. ‘ఈ విటారా’గా వస్తున్న ఈ కార్ల విక్రయాలను త్వరలో ప్రారంభించనుట్లు ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి అమ్మకాలు ప్రారంభించే అవకాశాలున్నాయి. దీనిని గుజరాత్‌(Gujarat) ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కారును కేవలం భారత్‌(Bharath)లోనే కాకుండా సుమారు వంద దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు. జపాన్‌, యూరోప్‌ దేశాలున్నాయి. కంపెనీ(Company) నాలుగో త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన అనంతరం చైర్మన్‌ భరద్వాజ్‌ ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 70 వేల యూనిట్లను ఉత్పత్తి చేస్తామన్నారు. ఇందులో ఎక్కువ యూనిట్లను ఎగుమతి(Export) చేయనున్నట్లు తెలిపారు.

ఈ- విటారా కారును బీఈవీ ప్లాట్‌ఫామ్‌ హియర్టెక్ట్‌(BEV platform Heartect )పై నిర్మించారు. దీనిలో రెండు (49 కిలోవాట్లు, 61 కిలోవాట్ల) బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. ఒక్కసారి చార్జి చేస్తే 500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.

Must Read
Related News