అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maruti Suzuki Dzire | ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన మారుతి సుజుకీ.. బడ్జెట్ కార్ల తయారీలో తనదైన ముద్ర వేసుకుంది. ఈ కంపెనీ తయారు చేసిన పలు మోడళ్లు భద్రత పరంగానూ అత్యుత్తమ ప్రమాణాలను సాధించాయి. ప్రధానంగా డిజైర్ 2025 మోడల్ భద్రతలో 5 స్టార్ రేటింగ్(5 Star rating) సాధించింది. 5 స్టార్ సేఫ్టీ, అత్యధిక మైలేజీతో ఈ మోడల్ మధ్య తరగతి ప్రజలను ఆకర్షిస్తోంది.
Maruti Suzuki Dzire | అధిక మైలేజీ..
మారుతి సుజుకీ డిజైర్(Maruti Suzuki Dzire) 2025 కటింగ్ ఎడ్జ్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 82 పీఎస్ పవర్, 112 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ వేరియంట్‌లో 70 పీఎస్, 102 ఎన్‌ఎం ఉత్పత్తి అవుతుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5 స్పీడ్ మాన్యువల్(MT), 5 స్పీడ్ ఏఎంటీ(AMT) ఉన్నాయి. సీఎన్‌జీ మాత్రమే ఎంటీతో వస్తుంది. ఈ కారు సిటీ డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. హైవేలో గంటకు 80 కిలోమీటర్ల వేగంలో మంచి రెస్పాన్స్ ఇస్తుంది. పెట్రోల్ ఎంటీలో లీటరుకు 24.79 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. ఏఎంటీలో లీటరుకు 25.71 కిలోమీటర్లు, సీఎన్‌జీలో కేజీకి 33.73 కిలోమీటర్ల మైలేజీ(Mileage) వస్తుంది. అందుకే ఎక్కువ మైలేజీ కోరుకునేవారికి డిజైర్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
Maruti Suzuki Dzire | సేఫ్టీలోనూ బెస్ట్..
మారుతి సుజుకీ (Maruti Suzuki) డిజైర్ కారు బలమైన బిల్ట్ క్వాలిటీతో వచ్చింది. 6 ఎయిర్‌బ్యాగ్స్ (6 Air Bags), ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్‌పీ, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ ఉన్నాయి. జెడ్‌ఎక్స్‌ఐ వేరియంట్ నుంచి టీపీఎంఎస్, రియర్‌వ్యూ కెమెరా, టాప్ జడ్‌ఎక్స్‌ఐ ప్లస్‌లో 360 డిగ్రీ కెమెరా (2డీ అండ్ 3డీ వ్యూస్) లభిస్తాయి. మారుతి నుంచి ఈ మోడల్ సేఫ్టీ స్టాండర్డ్స్‌లో ముందంజలో ఉంది. అందుకే 2025 గ్లోబల్ ఎన్‌సీఏపీ, భారత ఎన్‌సీఏపీ నుంచి మారుతి సుజుకీ డిజైర్ 5 స్టార్ రేటింగ్ సాధించింది.
Maruti Suzuki Dzire | ఆధునిక ఫీచర్లు..
టాప్ వేరియంట్‌లలో 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ ఉన్నాయి. వీఎక్స్‌ఐ(Vxi) లో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్, సన్‌రూఫ్(సింగిల్ పేన్), వైర్‌లెస్ చార్జర్, ఆటో క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. బేస్ మోడల్‌లో కూడా పార్కింగ్ సెన్సార్స్, కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్లు మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో డిజైర్‌ను పోటీలో నిలుపుతున్నాయి.
Maruti Suzuki Dzire | ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైన్..
డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బీజ్ థీమ్‌తో వచ్చింది. వుడెన్ ఇన్సర్ట్స్, బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్, లెదరెట్ స్టీరింగ్ వీల్ అండ్ గేర్ నాబ్ ఉన్నాయి. ఫ్రంట్ సీట్లు ఆఫ్ వైట్ ఫాబ్రిక్‌తో మంచి సపోర్ట్ ఇస్తాయి. డ్రైవర్ సీట్ హైట్ (Driver Seat Height) అడ్జస్టబుల్(వీఎక్స్‌ఐ నుంచి)గా ఉంది. రియర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, ఏసీ వెంట్స్, లార్జ్ విండోస్ ఉన్నాయి.
ఎక్స్‌టీరియర్ స్లీక్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ గ్రిల్, వై షేప్డ్ టైల్‌ల్యాంప్స్‌తో మోడరన్ లుక్ ఇస్తుంది. బూట్ స్పేస్ 382 లీటర్లు(పెట్రోల్).
Maruti Suzuki Dzire | వేరియంట్లు, ధర..
ఎల్‌ఎక్స్‌ఐ (బేస్, ఎంటీ పెట్రోల్), వీఎక్స్‌ఐ (ఎంటీ/ఏఎంటీ పెట్రోల్, సీఎన్‌జీ), జడ్‌ఎక్స్‌ఐ(ఎంటీ/ఏఎంటీ పెట్రోల్, సీఎన్‌జీ), జడ్‌ఎక్స్‌ఐ ప్లస్(ఎంటీ/ఏఎంటీ పెట్రోల్) వేరియంట్‌లలో ఈ మోడల్ కారు లభిస్తోంది.
జీఎస్టీ సంస్కరణలతో డిజైర్ ధరలు గరిష్టంగా రూ. 87,700 వరకు తగ్గాయి. బేస్ మోడల్ ఎల్‌ఎక్స్‌ఐ(LXi) వేరియంట్ రూ.6.26 లక్షలకు(ఎక్స్ షోరూమ్) లభిస్తోంది. టాప్ మోడల్ జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్(ZXI +) ఏఎంటీ వేరియంట్ ధర రూ. 9.31 లక్షల(ఎక్స్ షోరూమ్) వరకు ఉంది.