అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maruti Jimny | కాంపాక్ట్ ఎస్‌యూవీ(Compact SUV) మోడల్ జిమ్నీ అరుదైన రికార్డ్ సాధించింది. మారుతి సుజుకీ(Maruti Suzuki) కంపెనీకి చెందిన జిమ్నీ 5 డోర్ మోడల్.. లాంచ్ అయినప్పటి నుంచి లక్ష యూనిట్ల మైలురాయిని అధిగమించింది.
భారతదేశంలో తయారైన మారుతి సుజుకీ జిమ్నీ ఎగుమతుల(Exports)ను కంపెనీ 2023లో ప్రారంభించింది. ప్రస్తుతం భారత్ నుంచి మెక్సికో, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా(South Africa), చిలీ సహా 100కుపైగా దేశాలకు ఈ మోడల్‌ను ఎగుమతి చేస్తోంది. 2025 జనవరిలో జిమ్నీ నోమేడ్ పేరుతో జపాన్(Japan)లో ఈ కారును విడుదల చేసింది. ఈ మోడల్ అక్కడ ఎక్కువ ఆదరణ పొందింది. జపాన్‌లోనే 50 వేలకు పైగా ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. జిమ్నీ ప్రస్తుతం 6 వేరియంట్లు, 4 రంగుల్లో లభిస్తోంది. ఇది రూ. 12.31 లక్షల(ఎక్స్ షోరూం)నుంచి లభ్యమవుతోంది.
మారుతి సుజుకీ మొత్తం 16 కార్లను అంతర్జాతీయ మార్కెట్(International Market)లో విక్రయిస్తుండగా ఇందులో జిమ్నీ మోడల్ ఎక్కువ మందిని ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. మారుతి సుజుకీ ఇండియా కంపెనీ ఫ్రాంక్స్ క్రాస్ ఓవర్(Fronx crossover) తర్వాత ప్రస్తుతం ఎక్కువగా ఎగుమతి చేస్తున్న రెండో మోడల్‌గా జిమ్నీ 5 డోర్ నిలుస్తోంది. కాగా గతంలో పోల్చితే సెప్టెంబర్‌లో జిమ్నీ అమ్మకాలు తగ్గాయి. ఆగస్టులో 603 యూనిట్లు విక్రయించగా.. సెప్టెంబర్‌లో 296 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
