ePaper
More
    Homeటెక్నాలజీMaruti Swift | స్విఫ్ట్‌ లవర్స్‌కు ‘మారుతి’ గుడ్‌ న్యూస్‌

    Maruti Swift | స్విఫ్ట్‌ లవర్స్‌కు ‘మారుతి’ గుడ్‌ న్యూస్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Maruti Swift | ఒకప్పుడు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లలో ఒకటిగా నిలిచిన మారుతి స్విఫ్ట్‌(Maruti Swift) తయారీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. భారతీయుల మది దోచుకున్న ఈ మోడల్‌ ఉత్పత్తి రెండు వారాల క్రితం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇక స్విఫ్ట్‌ కథ కంచికేనా అనుకుంటున్న తరుణంలో మారుతి సుజుకీ(Suzuki) కంపెనీ తాజాగా తన స్విఫ్ట్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వచ్చే వారంలో స్విఫ్ట్‌ కార్ల తయారీని ప్రారంభించనున్నట్లు పేర్కొంది.

    ఓవైపు పర్యావరణ కారణాలతో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల (renewable energy resources) వినియోగం వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అనుసరిస్తున్న విధానాలతో అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వివిధ దేశాల మధ్య ట్రేడ్‌ వార్‌ (Trade war) ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్‌ రంగం కుదుపునకు గురవుతోంది. చైనా(China) కొన్ని అరుదైన ఖనిజాలను (Rare earth minerals) ఎగుమతి చేయడంపై ఆంక్షలు విధించడంతో ఆటో రంగం ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటోంది.

    ఈ ఖనిజాలు ఆటోమొబైల్‌ తయారీలో, ముఖ్యంగా ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌(Hybrid) వాహనాల్లో కీలకమైనవి. దీని ప్రభావం మారుతి సుజుకీ కంపెనీకి చెందిన స్విఫ్ట్‌ మోడల్‌ ఉత్పత్తిపై పడింది. భారతీయ మధ్యతరగతి ప్రజలకు ఇష్టమైన ఈ మోడల్‌ కారు ఉత్పత్తిని కంపెనీ మార్చి 26న నిలిపివేసింది. చైనా అరుదైన ఖనిజాల సరఫరాపై ఆంక్షలు విధించడమే దీనికి కారణమని తేలింది. అయితే ఇందులో స్విఫ్ట్‌ స్పోర్ట్‌ వర్షన్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చింది. కాగా పరిస్థితి మెరుగుపడడంతో ప్రస్తుతం కార్ల తయారీకి అవసరమైన పార్ట్స్‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో తిరిగి స్విఫ్ట్‌ కార్ల తయారీని ప్రారంభించాలని మారుతి సుజుకీ కంపెనీ నిర్ణయించింది. కంపెనీ చేసిన ప్రకటన ప్రకారం ఈనెల 13 నుంచి సగారా ప్లాంట్‌లో స్విఫ్ట్‌ కార్ల తయారీ ప్రారంభం కానుంది. ఈనెల 16 నుంచి పూర్తి స్థాయి ఉత్పత్తి(Production)ని ప్రారంభించనున్నారు.

    Maruti Swift | యూకేలో ఆ మోడళ్లు లభించవు!?

    యూకేలో సుజుకీ స్విఫ్ట్‌ స్పోర్ట్‌ (Suzuki Swift Sport), జిమ్నీ ఎల్‌సీవీ, ఇగ్నిస్‌, స్వేస్‌ మోడళ్లను డీలర్‌ స్టాక్‌ అయిపోయినప్పుడు నిలిపివేయనున్నట్లు సుజుకీ కంపెనీ ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం ప్రపంచం ఎలక్ట్రిక్‌ వాహనాల(EV) వైపు మళ్లుతుండడమే.. సుజుకీ సైతం ఈ రంగంపై దృష్టి సారించింది. దీంతో ఈవీ స్విఫ్ట్‌ మోడళ్లు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...