HomeUncategorizedThe Raja Saab | ఏంటి.. ప్ర‌భాస్ రాజా సాబ్‌కి కూడా సీక్వెల్ ఉంటుందా.. ర‌న్...

The Raja Saab | ఏంటి.. ప్ర‌భాస్ రాజా సాబ్‌కి కూడా సీక్వెల్ ఉంటుందా.. ర‌న్ టైమ్ ఎంతో తెలుసా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: The Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ న‌టిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్. ఈమూవీలో ప్ర‌భాస్ వింటేజ్ లుక్ తోపాటు డార్లింగ్ కామెడీ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచ‌నుంది. మేకర్స్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రభాస్ లుక్స్, విజువల్స్, మ్యూజిక్, బీజీఎం పరంగా ఎక్కడా లోటు లేకుండా గ్రాండ్ అవుట్ పుట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ది రాజా సాబ్(Raja Saab) కథ విషయంలోనూ దర్శకుడు, నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రీసెంట్‌గా రాజాసాబ్ టీజ‌ర్ వ‌చ్చింది. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. ప్ర‌భాస్(Prabhas) చూడ్డానికి బాగున్నాడు. విజువ‌ల్స్ కూడా అదిరాయి. ఈ టీజ‌ర్ తో ఈ సినిమాపై న‌మ్మ‌కాలు, అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి.

The Raja Saab | సీక్వెల్‌పై క్లారిటీ..

ఈ టీజ‌ర్ వేడుక‌లో రాజాసాబ్ లెంగ్త్ గురించి ద‌ర్శ‌కుడు మారుతి (Maruti) నోరు జారాడు. ‘సినిమా మూడున్న‌ర గంట‌లు’ అంటూ చెప్పేశాడు. ఇప్ప‌టికే మూడు గంట‌ల సినిమా త‌యారైంది. తీయాల్సిన సీన్లు కొన్ని ఉన్నాయి. పాటలు బాలెన్స్‌. అవ‌న్నీ క‌లిపితే మూడున్న‌ర గంట‌లు గ్యారెంటీ. దాన్ని ఎంత ట్రిమ్ చేసినా మూడు గంట‌ల లెక్క తేలుతుంది. ఓ ద‌శ‌లో ఫుటేజ్ చూసిన నిర్మాత ఈ సినిమాని రెండు భాగాలుగా మారిస్తే ఎలా ఉంటుంది? అనే ఐడియా ఇచ్చార‌ట‌. కానీ మారుతి ఒప్పుకోలేదు. ఎందుకంటే రాజాసాబ్ 2(Raja Saab 2) కి సంబంధించిన ఐడియా మారుతి ద‌గ్గ‌ర రెడీగా వుంది. పార్ట్ 2కి చాలా డిఫ‌రెంట్ గా ట్రై చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. అందుకే మారుతి ఒప్పుకోలేదు.

ది రాజా సాబ్ మూవీకి సీక్వెల్ (Movie Sequel) ఏమైనా ఉంటుందా?’ అని ఎదురైన ప్రశ్నకు మారుతి స్పందించారు. పార్ట్ 2 కోసం బలవంతంగా స్టోరీని సాగదీసి రుద్దనని చెప్పారు. ‘మూవీ పూర్తయ్యాక చూద్దాం. పార్ట్ 2 కోసం బలవంతంగా కథ సాగదీసి రుద్దను. దానిపై ఫుల్ క్లారిటీ మాకు ఉంది. నటీనటులకు 8 గంటల వర్క్ అనేది సాధారణం. కానీ ఈ మూవీ కోసం మేము 18 గంటలు వర్క్ చేశాం. అందుకే టీజర్ సహా ఇంత మంచి అవుట్ పుట్ వచ్చింది.’ అని చెప్పారు. తమన్ అద్భుత మ్యూజిక్ అందిస్తున్నారు. అది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. హీరో ఎంట్రీ సాంగ్, ముగ్గురు హీరోయిన్స్‌తో మరో సాంగ్ అన్నీ డార్లింగ్ ఫ్యాన్స్‌తో సహా అంతా ఎంజాయ్ చేస్తారు. ఓ అభిమానిగా నా హీరోను ఎలా చూపించాలనుకున్నానో అలానే చూపించా. ప్రభాస్ ప్రత్యేక కామెడీ టైమింగ్‌ను పాన్ ఇండియా స్థాయిలో చూపించాలనుకున్నాం అని మారుతి చెప్పుకొచ్చారు.