Homeక్రైంKarnataka | భార్య ఫోన్ ఎక్కువ‌గా మాట్లాడుతుంద‌ని కొడ‌వలితో విచ‌క్ష‌ణార‌హితంగా నరికిన భ‌ర్త‌

Karnataka | భార్య ఫోన్ ఎక్కువ‌గా మాట్లాడుతుంద‌ని కొడ‌వలితో విచ‌క్ష‌ణార‌హితంగా నరికిన భ‌ర్త‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Karnataka | ఈ మ‌ధ్య భార్య భ‌ర్తల‌కు సంబంధించిన వార్తలు అంద‌రిని ఉలికిప‌డ్డేలా చేస్తున్నాయి. వివాహేత‌ర సంబంధాల కారణంగా తమ జీవిత భాగస్వామిని అడ్డుతొల‌గించుకునేందుకు హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగుచూసున్నాయి. ఇటీవల మేఘాలయ(Meghalaya)లో జరిగిన హనీమూన్ హత్య ఎంత ప్ర‌కంప‌న‌లు పుట్టించింది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ ఘటన మరువక ముందే, జార్ఖండ్‌(Jharkhand)లో ఓ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు.

Karnataka | ఫోన్ తెచ్చిన తంటా..

మరో ఘటనలో భ‌ర్త తినే ఆహారంలో పురుగుల మందు కలిపి ఇచ్చి, అతని మరణానికి కారణమైంది. తన భర్త చేత పురుగుల మందు కొనిపించి మ‌రీ అత‌ను తినే సమోసాలలో క‌లిపింది. అనుమానం వ‌చ్చి అడిగినా కూడా ఏదో మాయమాటలు చెప్పి వాటిని తినిపించింది. ఇలాంటి ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆవేశంలోనో లేదంటే అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్ల‌నో ప‌చ్చ‌ని సంసారాలు కూలిపోతున్నాయి. ఇక తాజాగా జరిగిన ఘ‌ట‌న అయితే అంద‌రూ ఉలిక్కిప‌డేలా చేసింది.

నిత్యం సెల్ ఫోన్‌(Cell Phone)లో మాట్లాడుతుందని ఓ వ్యక్తి తన భార్యను హత మార్చాడు ఈ ఘటన ఉడిపి జిల్లా(Udupi District) బ్రహ్మవారి తాలూకా హిలియాణ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో గణేష్ , రేఖ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవల రేఖకు కొత్త సెల్ ఫోన్ కొనిచ్చాడు భ‌ర్త‌. దీంతో ఆమె రోజు బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి గంటల కొద్ది మాట్లాడేది. ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడవద్దని భర్త హెచ్చరిస్తుండడంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడవ జరిగింది. గురువారం మద్యం మ‌త్తులో ఇంటికి వచ్చిన గణేష్ భార్యతో గొడవ దిగి కత్తితో కడుపు భాగంలో పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మ‌రణించింది. ఉడిపి జిల్లా బ్రహ్మ వర తాలూకా శంకర్ నారాయణ పోలీసులు గణేష్​ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ హ‌రిరామ్ శంక‌ర్(SP Hariram Shankar) పరిశీలించారు.