అక్షరటుడే, బిచ్కుంద: Kamareddy : జీవితంపై విరక్తితో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బిచ్కుంద మండలం(Bichkunda mandal)లోని పుల్కల్ గ్రామానికి చెందిన చాకలి సునీత భర్త గతంలో చనిపోయాడు. దీంతో ఆమె గత కొంతకాలంగా మానసికంగా బాధపడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం(జూన్ 8) రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మోహన్ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.