అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Allu Sirish | టాలీవుడ్లో మళ్లీ పెళ్లి సందడి మొదలవనున్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారని వార్తలు ఊపందుకున్నాయి.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) చిన్న కుమారుడు, యాక్టర్ అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అల్లు శిరీష్ హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెని పెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇరు కుటుంబాల మధ్య ఇప్పటికే చర్చలు పూర్తయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా ప్రకటన వెలువడకపోయినప్పటికీ, అల్లు ఫ్యామిలీ నుంచి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అయితే ఇటీవల అల్లు శిరీష్ (Allu Sirish) బామ్మ కనకరత్నమ్మ మరణించిన నేపథ్యంలో, ఈ వివాహ కార్యక్రమాలు కొంతకాలం వాయిదా పడ్డాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. చిన్న వయసులోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన హిందీ చిత్రం ప్రతిబంధ్లో (1990) చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరపై కనిపించిన అల్లు శిరీష్, తర్వాత గౌరవం సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో వంటి చిత్రాల్లో నటించారు. చివరిసారిగా 2023లో ‘బడ్డీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే ఆ తర్వాత కొత్త సినిమాలపై ఆయన నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. ఫిల్మ్ ఈవెంట్స్, సోషల్ మీడియా లైమ్ లైట్‌లో కూడా తక్కువగా కనిపిస్తున్న శిరీష్, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు.
మెగా ఫ్యామిలీలో ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ బ్యాచిలర్స్‌గానే ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో శిరీష్ ముందుగా పెళ్లిపీటలెక్కుతున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక టాలీవుడ్లో మిగిలిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల లిస్ట్ చూస్తే.. ప్రభాస్ ఐదు పదుల వయస్సుకు చేరుకుంటున్నా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. రాం పోతినేని 37 ఏళ్లు అయినా ఇంకా పెళ్లిపై స్పష్టత లేదు. విజయ్ దేవరకొండ – రష్మికతో రిలేషన్‌పై అనేక రూమార్స్ వస్తున్నాయి. సందీప్ కిషన్, అడివి శేష్, ఆనంద్ దేవరకొండ వంటి పలువురు హీరోలు ఇప్పటికీ బ్యాచిలర్స్‌గానే ఉన్నారు.