Homeక్రీడలుWTC Final | ఎన్నో ఏళ్ల క‌ల నెర‌వేర్చుకునేందుకు కొద్ది దూరంలో స‌ఫారీ జ‌ట్టు

WTC Final | ఎన్నో ఏళ్ల క‌ల నెర‌వేర్చుకునేందుకు కొద్ది దూరంలో స‌ఫారీ జ‌ట్టు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: WTC Final | సౌతాఫ్రికా South Africa జ‌ట్టుకి ఎన్నో ఏళ్ల నుండి ఐసీసీ ట్రోఫీ(ICC Trophy) అందుకోవాల‌నే క‌ల ఉంది. చాలా సార్లు చివ‌రి వ‌ర‌కు వ‌చ్చి క‌ప్‌ని పోగొట్టుకునేవారు. ఈ మ‌ధ్య జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీని సౌతాఫ్రికా అందుకోవాలి. కానీ వారు చేసిన త‌ప్పులు నిరాశ‌ని మిగిల్చాయి. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(World Test Championship) 2025లో సౌతాఫ్రికా గెలుపు ముంగిట ఉంది. సౌతాఫ్రికా ఓపెనర్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ సెంచరీతో చెలరేగాడు. భీకరమైన ఆస్ట్రేలియన్‌ పేస్‌ ఎటాక్‌కు ఎదురొడ్డి నిల్చొని సెంచరీతో కదం తొక్కాడు. అతనికి తోడు ప్రొటీస్‌ కెప్టెన్‌ టెంబ బవుమా(Captain Bavuma) సైతం హాఫ్‌ సెంచరీ అదరగొట్టారు. వీరిద్దరి బ్యాటింగ్‌ దెబ్బకు రెండో డబ్ల్యూటీసీ టైటిల్‌ గెలవాలనే ఆసీస్ కలలు ఆవిరి కానున్నాయి.

WTC Final | ఏం చేస్తారో మ‌రి..

సౌతాఫ్రికా దాదాపు డబ్ల్యూటీసీ ఫైనల్‌ WTC FInal గెలుపు ముంగిట్లో నిల్చుంది. మరో 69 పరుగులు చేస్తే చాలు.. సౌతాఫ్రికా చేతుల్లోకి వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ వచ్చేచ్చిసిన‌ట్టే. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నాయి.. రెండు రోజుల ఆట మిగిలి ఉంది.. క్రీజ్‌లో ఉన్న మార్కరమ్‌(Markaram), కెప్టెన్‌ బవుమా సూపర్‌గా ఆడుతున్నారు. మూడో డబ్ల్యూటీసీ వితేజ సౌతాఫ్రికానే అని అంద‌రూ ఫిక్స్ అయ్యారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా.. ఆస్ట్రేలియా మ్యాచ్‌ గెలిచే పరిస్థితి లేదు. కానీ, సౌతాఫ్రికాకు ఉండే దరిద్రం గురించి మ‌న‌కు తెలిసిందే. అందుకు వారు ఇంకా విజయంపై అంత ధీమాగా లేరు. ఆ విషయం అంటుంచితే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా(South Africa) రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది.

విజయానికి ఇంకా 69 పరుగులు కావాలి. ఎయిడెన్‌ మార్కరమ్‌ 159 బంతుల్లో 11 ఫోర్లతో 102 పరుగులు, కెప్టెన్‌ టెంబ బవుమా Bavuma 121 బంతుల్లో 5 ఫోర్లతో 65 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నారు. నాలుగో రోజు వీరిద్దరే మ్యాచ్‌ ముగిస్తారా, లేదా కొన్ని వికెట్స్ కోల్పోతారా అన్న‌ది చూడాలి. 144/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా.. మిచెల్ స్టార్క్- జోష్ హజెల్ వుడ్ భాగస్వామ్యంతో రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులు చేసింది. దాంతో సౌతాఫ్రికా ముందు 282 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. మిచెల్ స్టార్క్, జోష్ హజెల్‌వుడ్ ఇద్దరూ కలిసి టెస్ట్ క్రికెట్‌లో 10వ వికెట్‌కు మూడు 50 ప్లస్ పార్ట్‌నర్‌షిప్స్ నమోదు చేశారు. ఈ క్రమంలో వారు న్యూజిలాండ్‌కు చెందిన బీజే వాట్లింగ్, ట్రెంట్ బౌల్ట్ రికార్డ్‌ను సమం చేశారు.