అక్షరటుడే, ఇందూరు: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఈ నెల 13వ తేదీన ‘మార్కింగ్ మహామేళా’ (Marking Mahamela) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున ఇళ్ల మార్కింగ్ చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రొసీడింగ్స్ పూర్తయి మార్కింగ్ చేసుకోలేకపోయిన లబ్ధిదారులకు 13వ తేదీన మార్కింగ్ పూర్తిచేసి, ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా ప్రోత్సహించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Indiramma Housing Scheme | జిల్లావ్యాప్తంగా 17,301మంది లబ్ధిదారులు..
జిల్లావ్యాప్తంగా 17,301 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇందులో ఇప్పటికే 9,486 ఇల్లు గ్రౌండింగ్ జరిగాయని వివరించారు. మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే బేస్మింట్ పూర్తయిన ఇళ్లకు ఒక దఫా అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగిందని స్పష్టం చేశారు.