Stock Market
Stock Market | మార్కెట్లు పైపైకి.. 83 వేలు దాటిన సెన్సెక్స్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | యూఎస్‌ ఫెడ్‌ రేట్‌ కట్‌ ప్రకటనతో ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic Stock Markets).. మధ్యాహ్నం తర్వాత ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్‌ ఎఫ్‌అండ్‌వో వీక్లీ కాంట్రాక్ట్‌ ముగింపు రోజు కావడంతో వొలటాలిటీ ఎక్కువగా ఉంది.

దీనికితోడు ఇంట్రాడేలో రూపాయి బలహీనపడడం, గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో సూచీలు పడిపోయాయి. చివరి అరగంటలో నిలదొక్కుకుని పైకి ఎగబాకాయి. గురువారం ఉదయం సెన్సెక్స్‌ 415 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 111 పాయింట్ల భారీ లాభంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 82,704 నుంచి 83,141 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,329 నుంచి 25,448 పాయింట్ల రేంజ్‌లో ట్రేడ్‌్‌ అయ్యాయి. చివరికి సెన్సెక్స్‌(Sensex) 320 పాయింట్ల లాభంతో 83,013 వద్ద, నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో 25,423 వద్ద్ద స్థిరపడ్డాయి.

Stock Market | ఐటీ, ఫార్మా స్టాక్స్‌లో జోష్‌..

బీఎస్‌ఈలో ఫార్మా ఇండెక్స్‌(Pharma index) 0.87 శాతం, ఐటీ ఇండెక్స్‌ 0.84 శాతం పెరగ్గా.. క్యాపిటల్‌ మార్కెట్‌ 0.75 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.48 శాతం, బ్యాంకెక్స్‌ 0.36 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.35 శాతం, మెటల్‌ ఇండెక్స్‌ 0.35 శాతం పెరిగాయి. క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 0.33 శాతం, ఎనర్జీ 0.20 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ 0.15 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్‌ 0.10 శాతం నష్టపోయాయి. లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.36 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.36 శాతం లాభపడగా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.01 శాతం నష్టపోయింది.

అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,182 కంపెనీలు లాభపడగా 1,993 స్టాక్స్‌ నష్టపోయాయి. 167 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 170 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 48 కంపెనీలు 52 వారాల కనిష్టాల(52 weeks low) వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Top Gainers :బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 22 కంపెనీలు లాభాలతో ఉండగా.. 8 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్‌ 2.96 శాతం, సన్‌ఫార్మా 1.77 శాతం, ఇన్ఫోసిస్‌ 1.13 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.05 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 0.84 శాతం లాభపడ్డాయి.

Top Losers : టాటా మోటార్స్‌ 1.13 శాతం, ట్రెంట్‌ 1.04 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.83 శాతం, ఆసియా పెయింట్‌ 0.63 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.60 శాతం నష్టపోయాయి.