ePaper
More
    Homeబిజినెస్​Stock Market | నిలదొక్కుకున్న మార్కెట్లు.. 81 వేల మార్క్‌ను మరోసారి దాటిన సెన్సెక్స్‌

    Stock Market | నిలదొక్కుకున్న మార్కెట్లు.. 81 వేల మార్క్‌ను మరోసారి దాటిన సెన్సెక్స్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గత నాలుగైదు సెషన్లు కొనసాగుతున్న ట్రెండ్‌కు బ్రేక్‌ పడిరది. ఒడిదుడుకులకు లోనైనా ప్రధాన సూచీలు(Indices) ప్రారంభ లాభాలను నిలబెట్టుకున్నాయి. ఇన్ఫోసిస్‌(Infosys) బైబ్యాక్‌ ప్రపోజల్‌ ఐటీ రంగానికి బూస్ట్‌ ఇచ్చింది. సెన్సెక్స్‌ మరోసారి 81 వేల మార్క్‌ను దాటి నిలబడిరది.

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market) లాభాల బాటలో పయనించింది. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌ 342 పాయింట్లు, నిఫ్టీ 91 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. గత సేషన్లలాగే ఇంట్రాడే గరిష్టాల వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌ జరుగుతుండడంతో సూచీలు వెనక్కి వస్తున్నాయి. సెన్సెక్స్‌(Sensex) 80,928 నుంచి 81,181 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 24,814 నుంచి 24,891 పాయింట్ల మధ్యలో ట్రేడ్‌ అయ్యాయి. చివరికి సెన్సెక్స్‌ 314 పాయింట్ల లాభంతో 81,11 వద్ద, నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 24,868 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ(Nifty) 50లలో టాప్‌ గెయినర్‌గా ఇన్ఫోసిస్‌ నిలవగా.. టాప్‌ లూజర్‌గా ట్రెంట్‌ నిలిచింది.

    ఐటీ, ఫార్మా షేర్లలో కొనుగోళ్ల మద్దతు..

    ఐటీ, ఫార్మా(Pharma), ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌(IT index) 2.89 శాతం పెరగ్గా.. హెల్త్‌కేర్‌ 0.67 శాతం, టెలికాం 0.57 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 0.54 శాతం, బీఎస్‌ఈ సర్వీసెస్‌ 0.43 శాతం లాభపడ్డాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, రియాలిటీ ఇండెక్స్‌లు 0.31 శాతం, ఎనర్జీ 0.20 శాతం, పీఎస్‌యూ 0.17 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌, ఆటో ఇండెక్స్‌లు 0.13 శాతం నష్టపోయాయి. లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.36 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.22 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.20 శాతం పెరిగాయి.

    అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

    బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,994 కంపెనీలు లాభపడగా 2,130 స్టాక్స్‌ నష్టపోయాయి. 157 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 144 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 58 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల విలువ రూ. 0.75 లక్షల కోట్లమేర పెరిగింది.

    Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో ఉండగా.. 10 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇన్ఫోసిస్‌ 5.03 శాతం, టెక్‌ మహీంద్రా 2.42 శాతం, అదానీ పోర్ట్స్‌ 2.40 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.78 శాతం, టీసీఎస్‌ ఒక శాతం లాభపడ్డాయి.

    Top Losers : ట్రెంట్‌ 1.79 శాతం, ఎటర్నల్‌ 1.18 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.91 శాతం, ఎన్టీపీసీ 0.75 శాతం, టైటాన్‌ 0.55 శాతం నష్టపోయాయి.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...