Homeబిజినెస్​Stock Market | సుంకాల భయంనుంచి తేరుకుంటున్న మార్కెట్లు.. స్వల్ప నష్టాలతో ట్రేడ్‌ అవుతున్న ప్రధాన...

Stock Market | సుంకాల భయంనుంచి తేరుకుంటున్న మార్కెట్లు.. స్వల్ప నష్టాలతో ట్రేడ్‌ అవుతున్న ప్రధాన సూచీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | రష్యా (Russia) నుంచి ఇంధనం, రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుందన్న కారణాలతో యూఎస్‌ 25 శాతం సుంకాలు (Tariffs), జరిమానాలను ప్రకటించడం, ఇవి శుక్రవారం నుంచి అమలులోకి రానుండడంతో మన మార్కెట్లు భారీ నష్టాలతో ఓపెన్‌ అయ్యాయి.

ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం కూడా నష్టాలకు కారణమయ్యాయి. అయితే కొద్దిసేపటికే దేశీయ స్టాక్‌ మార్కెట్లు ట్రంప్‌ సుంకాల భయం నుంచి తేరుకుంటున్నాయి. నష్టాలను తగ్గించుకున్నాయి. గురువారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 786 పాయింట్లు, నిఫ్టీ 213 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 201 పాయింట్ల నష్టంతో 81,241 వద్ద, నిఫ్టీ(Nifty) 72 పాయింట్ల నష్టంతో 24,782 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి (Rupee) మారకం విలువ భారీగా క్షీణించింది. గురువారం ఇంట్రాడేలో 89 పైసలు పతనమైంది. ఇది మూడేళ్లలో ఒక రోజులో నమోదైన భారీ పతనం. రూపాయి విలువ దిగుమతి ఖర్చులతోపాటు వాణిజ్య లోటును పెంచుతుంది.

Stock Market | ఎఫ్‌ఎంసీజీ మినహా..

ఎఫ్‌ఎంసీజీ (FMCG) మినహా మిగిలిన రంగాల షేర్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. బీఎస్‌ఈలో టెలికాం (Telecom) ఇండెక్స్‌ 1.37 శాతం పడిపోగా.. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 1.05 శాతం నష్టపోయింది. ఎనర్జీ ఇండెక్స్‌ 0.99 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్స్‌ 0.89 శాతం, రియాలిటీ 0.80 శాతం, హెల్త్‌కేర్‌ 0.66 శాతం, ఐటీ 0.56 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ సూచీ 0. 52 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 0.91 శాతం లాభాలతో, మెటల్‌ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.63 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.39 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.19 శాతం నష్టాలతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 8 కంపెనీలు లాభాలతో ఉండగా.. 22 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. హెచ్‌యూఎల్‌ 2.57 శాతం, పవర్‌గ్రిడ్‌ 0.81 శాతం, ఐటీసీ 0.66 శాతం, ఎటర్నల్‌ 0.48 శాతం, ఎంఅండ్‌ఎం 0.26 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఆసియా పెయింట్‌ 1.13 శాతం, రిలయన్స్‌ 1.12 శాతం, టైటాన్‌ 1.10 శాతం, ఎయిర్‌టెల్‌ 1.07 శాతం, టీసీఎస్‌ 0.69 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి.

Must Read
Related News