Homeబిజినెస్​Stock Market | కోలుకున్న మార్కెట్లు.. స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు

Stock Market | కోలుకున్న మార్కెట్లు.. స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్​ మార్కెట్లు చివరి గంటలో కోలుకున్నాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్వల్ప నష్టాలతో ముగిశాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | భారీ నష్టాల దిశగా సాగిన స్టాక్‌ మార్కెట్లు(Stock market).. చివరి గంటలో కోలుకున్నాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో పైకి లేచాయి. చివరికి సెన్సెక్స్‌ 150 పాయింట్లు, నిఫ్టీ 29 పాయింట్ల స్వల్ప నష్టాలతో ముగిశాయి.

చివరి 45 నిమిషాలలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Market) కోలుకున్నాయి. కనిష్టాల వద్దనుంచి సెన్సెక్స్‌ 400 పాయింట్లకుపైగా పెరగగా.. నిఫ్టీ 130 పాయింట్లు ఎగబాకింది. యూఎస్‌, చైనాల మధ్య వాణిజ్య చర్చల పురోగతిపై ఇన్వెస్టర్లలో ఆశలు చిగురించడం, యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు మార్కెట్‌లో రికవరీకి కారణంగా నిలిచాయి. మంగళవారం ఉదయం 153 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్‌.. అక్కడినుంచి 361 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌(Profit booking)తో సూచీలు పడిపోయాయి. ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్‌ 767 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ(Nifty) 27 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా అక్కడినుంచి కోలుకుని 102 పాయింట్లు లాభపడిరది. అనంతరం ఇంట్రాడే గరిష్టాలనుంచి 231 పాయింట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్‌(Sensex) 150 పాయింట్ల లాభంతో 84,628 వద్ద, నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 25,936 వద్ద స్థిరపడ్డాయి.

మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లలో ర్యాలీ..

బీఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 1.30 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.16 శాతం పెరగ్గా.. కమోడిటీ 0.55 శాతం, క్యాపిటల్‌ మార్కెట్‌ 0.49 శాతం లాభపడ్డాయి. రియాలిటీ ఇండెక్స్‌ ఒక శాతం, యుటిలిటీ 0.82 శాతం, ఐటీ ఇండెక్స్‌ 0.72 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ 0.64 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.63 శాతం, ఎనర్జీ 0.47 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.42 శాతం, ఆటో ఇండెక్స్‌ 0.42 శాతం నష్టపోయాయి. మిడ్‌ క్యాప్‌(Mid cap) ఇండెక్స్‌ 0.12 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.06 శాతం లాభపడగా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.16 శాతం నష్టపోయింది.

అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,910 కంపెనీలు లాభపడగా 2,246 స్టాక్స్‌ నష్టపోయాయి. 176 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 160 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 84 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 9 కంపెనీలు లాభాలతో ఉండగా.. 21 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టాటా స్టీల్‌ 2.97 శాతం, ఎల్‌టీ 1.23 శాతం, ఎస్‌బీఐ 0.76 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 0.54 శాతం, ఎయిర్‌టెల్‌ 0.45 శాతం పెరిగాయి.

Top Losers : ట్రెంట్‌ 1.54 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.05 శాతం, టెక్‌ మహీంద్రా 1.03 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఒక శాతం, పవర్‌గ్రిడ్‌ 0.93 శాతం నష్టపోయాయి.