అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic Stock Markets) నూతన వారాన్ని ఆశావహ దృక్పథంతో ప్రారంభించాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రధాన సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 194 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 61 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. స్వల్ప ఒడిదుడుకులకు లోనవుతున్నా లాభాల బాటలోనే పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 80,765 నుంచి 81,048 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 24,758 నుంచి 24,845 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 11.35 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 233 పాయింట్ల లాభంతో 80,944 వద్ద, నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో 24,818 వద్ద ఉన్నాయి.
జోరుమీదున్న ఆటో.. కోలుకోని ఐటీ..
జీఎస్టీ(GST) సంస్కరణలతో ఆటో రంగంలో జోరు కొనసాగుతుండగా.. యూఎస్‌తో వాణిజ్య అనిశ్చితులతో ఐటీ సెక్టార్(IT sector) మాత్రం ఇంకా కోలుకోలేకపోతోంది. బీఎస్‌ఈలో ఆటో ఇండెక్స్(Auto index) 2.43 శాతం పెరగ్గా.. మెటల్ 1.05 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.02 శాతం, యుటిలిటీ 0.68 శాతం, కమోడిటీ 0.64 శాతం, క్యాపిటల్ గూడ్స్, పవర్ ఇండెక్స్‌లు 0.56 శాతం, ఇన్‌ఫ్రా 0.55 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 0.50 శాతం లాభాలతో ఉన్నాయి. ఐటీ ఇండెక్స్ 0.41శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.14 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.07 శాతం నష్టంతో సాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.61 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.51 శాతం, లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 0.36 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 17 కంపెనీలు లాభాలతో ఉండగా.. 13 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎంఅండ్‌ఎం 3.18 శాతం, టాటా మోటార్స్ 2.98 శాతం, అదానీ పోర్ట్స్ 2.08 శాతం, టాటా స్టీల్ 1.94 శాతం, మారుతి 1.43 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టీసీఎస్ 0.91 శాతం, టెక్ మహీంద్రా 0.69 శాతం, ఇన్ఫోసిస్ 0.60 శాతం, పవర్‌గ్రిడ్ 0.46 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.38 శాతం నష్టంతో ఉన్నాయి.