అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic Stock Markets) నిలకడగా పైకి పెరుగుతున్నాయి. చాలా కాలం తర్వాత ఎఫ్‌ఐఐలు వరుసగా నెట్ బయ్యర్లుగా నిలుస్తుండడం, బ్యాంక్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రధాన సూచీలు లాభాలతో సాగుతున్నాయి.
శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 97 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ(Nifty) 14 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమయ్యాయి. అయితే అక్కడినుంచి కోలుకుని లాభాలబాట పట్టాయి. సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్ట స్థాయినుంచి 544 పాయింట్లు, నిఫ్టీ 159 పాయింట్లు పెరిగాయి. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 322 పాయింట్ల లాభంతో 82,491 వద్ద, నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 24,281 వద్ద ఉన్నాయి.
Stock Market | మెటల్, కమోడిటీ మినహా..
మెటల్, కమోడిటీ సెక్టార్లు మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్‌ఈలో రియాలిటీ ఇండెక్స్ 1.98 శాతం, పీఎస్‌యూ బ్యాంక్(PSU Bank) 1.49 శాతం, టెలికాం 1.43 శాతం, యుటిలిటీ 1.15 శాతం, బ్యాంకెక్స్ 0.95 శాతం, పీఎస్‌యూ 0.92 శాతం, పవర్ 0.90 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.88 శాతం, ఇన్‌ఫ్రా ఇండెక్స్ 0.78 శాతం లాభాలతో ఉన్నాయి. మెటల్(Metal) ఇండెక్స్ 1.11 శాతం, కమోడిటీ 0.42 శాతం, ఐటీ 0.07 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్(Small cap index) 0.53 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.39 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.35 శాతం లాభంతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 23 కంపెనీలు లాభాలతో ఉండగా.. 7 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
ఎస్‌బీఐ 2.02 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.49 శాతం, ఎన్టీపీసీ 1.48 శాతం, బీఈఎల్ 1.31 శాతం, పవర్‌గ్రిడ్ 1.15 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టాటా స్టీల్ 1.90 శాతం, టీసీఎస్ 1.27 శాతం, టాటామోటార్స్ 0.18 శాతం, కోటక్ బ్యాంక్ 0.17 శాతం, ఎంఅండ్‌ఎం 0.15 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.