అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | మూడు రోజుల వరుస నష్టాల తర్వాత సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) ఊపిరి పీల్చుకున్నాయి. ప్రధాన సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 19 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 6 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైనా క్రమంగా లాభాలను పెంచుకున్నాయి. అక్కడినుంచి సెన్సెక్స్ గరిష్టంగా 405 పాయింట్లు, నిఫ్టీ 128 పాయింట్లు పెరిగాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 272 పాయింట్ల లాభంతో 80,081 వద్ద, నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 24,525 వద్ద కొనసాగుతున్నాయి.
Stock Market | ఎఫ్‌ఎంసీజీ మినహా..
ఎఫ్‌ఎంసీజీ మినహా మిగిలిన అన్ని ఇండెక్స్‌లు పాజిటివ్‌గా సాగుతున్నాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్(IT index) 1.71 శాతం పెరగ్గా.. క్యాపిటల్ మార్కెట్ 1.63 శాతం, పవర్ 1.46 శాతం,
కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.46 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.42 శాతం, ఆటో, మెటల్ ఇండెక్స్‌లు 1.21 శాతం, పీఎస్‌యూ 1.09 శాతం, యుటిలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం ఇండెక్స్‌లు 1.07 శాతం, కమోడిటీ 0.99 శాతం లాభాలతో సాగుతున్నాయి. ఎఫ్‌ఎంసీజీ సూచీ 0.20 శాతం నష్టంతో కదలాడుతోంది. మిడ్ క్యాప్ ఇండెక్స్(Mid cap index) 1.20 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.01 శాతం, లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 0.55 శాతం లాభంతో ఉన్నాయి.
Top Gainers :బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 21 కంపెనీలు లాభాలతో ఉండగా.. 9 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ట్రెంట్ 2.05 శాతం, ఎంఅండ్‌ఎం 2.01 శాతం, ఇన్ఫోసిస్ 1.96 శాతం, ఆసియా పెయింట్ 1.89 శాతం, పవర్‌గ్రిడ్ 1.76 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : సన్‌ఫార్మా 1.51 శాతం, ఐటీసీ 0.95 శాతం, రిలయన్స్ 0.56 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.29 శాతం, హెచ్‌యూఎల్ 0.25 శాతం నష్టంతో ఉన్నాయి.