అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic Stock Markets) లాభాల బాటలో సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 148 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా వెంటనే 284 పాయింట్లు క్షీణించింది. తిరిగి పుంజుకుని 366 పాయింట్లు ఎగబాకింది. 42 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty) కూడా తొలుత ఒడిదుడుకులకు లోనయ్యింది. ప్రారంభంనుంచి 78 పాయింట్లు నష్టపోయింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో ఇంట్రాడేలో 108 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 147 పాయింట్ల లాభంతో 80,228 వద్ద, నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 24,552 వద్ద కొనసాగుతున్నాయి.
Stock Market | మిశ్రమంగా సూచీలు..
ప్రధాన ఇండెక్స్‌లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. బీఎస్‌ఈలో క్యాపిటల్ గూడ్స్(Capital goods) ఇండెక్స్ 1.04 శాతం, ఎఫ్‌ఎంసీజీ సూచీ 0.98 శాతం, టెలికాం ఇండెక్స్ 0.64 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.45 శాతం, బ్యాంకెక్స్ 0.40 శాతం లాభంతో ఉన్నాయి. యుటిలిటీ ఇండెక్స్ 0.25 శాతం, ఐటీ ఇండెక్స్ 0.19 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.56 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.41 శాతం, లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం పెరిగాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 22 కంపెనీలు లాభాలతో ఉండగా.. 8 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ట్రెంట్ 2.39 శాతం, బీఈఎల్ 1.68 శాతం, ఐటీసీ 1.48 శాతం, అల్ట్రాటెక్ 1.34 శాతం, ఎల్‌టీ 1.32 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎంఅండ్‌ఎం 2.11 శాతం, ఎటర్నల్ 1.98 శాతం, ఇన్ఫోసిస్ 1.30 శాతం, ఎన్టీపీసీ 0.80 శాతం, టైటాన్ 0.45 శాతం నష్టంతో ఉన్నాయి.