అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Markets | భారత్, యూఎస్‌ల మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు చిగురిస్తుండడం, ఐటీ సెక్టార్(IT sector) పరుగులు తీస్తుండడం, రూపాయి విలువ బలపడుతుండడం, చాలా రోజుల తర్వాత ఎఫ్‌ఐఐలు నికర కొనుగోలుదారులుగా మారడం వంటి పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. నిఫ్టీ మరోసారి 25 వేల మార్క్‌ను టచ్ చేసింది.
భారత్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) చొరవ తీసుకోవడం, ప్రధాని మోదీ(PM Modi) సానుకూలంగా స్పందించడంతో దేశీయ ఇన్వెస్టర్లలో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో ఆశలు రేకెత్తుతున్నాయి. సమస్య సమసిపోతుందన్న ఆశతో కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.
బుధవారం ఉదయం సెన్సెక్స్ 403 పాయింట్లు, నిఫ్టీ 123 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 81,360 నుంచి 81,643 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ (Nifty) 24,958 నుంచి 25,035 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ (Sensex) 234 పాయింట్ల లాభంతో 81,022 వద్ద, నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 24,845 వద్ద ఉన్నాయి.
Stock Markets | ఆటో మినహా..
దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఐటీ సెక్టార్ షేర్లు దూసుకుపోతున్నాయి. వరుసగా రెండో రోజూ లాభాలతో సాగుతున్నాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్(IT index) 2.58 శాతం పెరగ్గా.. పీఎస్‌యూ బ్యాంక్ 2.05 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.36 శాతం, పీఎస్‌యూ 1.04 శాతం, ఇండస్ట్రియల్, రియాలిటీ ఇండెక్స్‌లు 0.99 శాతం, పవర్ 0.97 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.73 శాతం, బ్యాంకెక్స్ 0.71 శాతం లాభాలతో ఉన్నాయి. ఆటో ఇండెక్స్ (Auto index) 0.47 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.22 శాతం నష్టంతో సాగుతున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.84 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.73 శాతం, లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 0.50 శాతం లాభాలతో ఉన్నాయి.
Stock Markets | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో (BSE Sensex) 20 కంపెనీలు లాభాలతో ఉండగా.. 10 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్ 2.75 శాతం, బీఈఎల్ 2.32 శాతం, టెక్ మహీంద్రా 2.14 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.96 శాతం, టీసీఎస్ 1.89 శాతం లాభాలతో ఉన్నాయి.
Stock Markets | Top losers..
ఎంఅంద్‌ఎం 0.98 శాతం, మారుతి 0.74 శాతం, ఎటర్నల్ 0.49 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.45 శాతం, ఆసియాపెయింట్ 0.43 శాతం నష్టంతో ఉన్నాయి.
