Homeబిజినెస్​Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. లాభనష్టాల మధ్య ఊగిసలాట

Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. లాభనష్టాల మధ్య ఊగిసలాట

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌ 177 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 57 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి.

మార్కెట్లు ప్రారంభమైన కొంత సేపటికే నష్టాలలోకి జారుకున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. సెన్సెక్స్‌(Sensex) 80,201 నుంచి 80,677 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 24,593 నుంచి 24,731 పాయింట్ల మధ్యలో సాగుతున్నాయి. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 77 పాయింట్ల లాభంతో 80,442 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 24,663 వద్ద ఉన్నాయి.

పీఎస్‌యూ స్టాక్స్‌లో అదే జోరు..

పీఎస్‌యూ బ్యాంక్‌(PSU bank), మెటల్‌, పీఎస్‌యూ సెక్టార్లలో జోరు కొనసాగుతోంది. ఐటీ రంగం కోలుకుంటోంది. బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.62 శాతం పెరగ్గా.. మెటల్‌ సూచీ 1.12 శాతం పెరిగింది. కమోడిటీ 0.57 శాతం, ఐటీ(IT) 0.47 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. కన్జూమర్‌ డ్యూరెబుల్‌ ఇండెక్స్‌ 0.63 శాతం, రియాలిటీ 0.59 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.41 శాతం, ఇండస్ట్రియల్‌ 0.30 శాతం, ఆటో 0.26 శాతం, క్యాపిటల్‌ మార్కెట్‌ 0.68 శాతం నష్టాలతో ఉన్నాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.12 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.07 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.01 శాతం లాభాలతో సాగుతున్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 19 కంపెనీలు లాభాలతో ఉండగా.. 11 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. బీఈఎల్‌ 1.14 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.02 శాతం, అదానిపోర్ట్స్‌ 1.00 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.81 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.79 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఐటీసీ 0.96 శాతం, ఎల్‌టీ 0.68 శాతం, రిలయన్స్‌ 0.56 శాతం, మారుతి 0.42 శాతం, ట్రెంట్‌ 0.40 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.