Homeబిజినెస్​Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. మళ్లీ 24500 దిగువకు నిఫ్టీ

Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. మళ్లీ 24500 దిగువకు నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఆటో, ఐటీ(IT) రంగాలలో కొనుగోళ్ల మద్దతుతో తొలుత లాభాల దిశగా సాగిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets).. తర్వాత గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పతనమయ్యాయి.

కీలకమైన యూఎస్‌ ఇన్ల్ఫెషన్‌ డాటా(US inflation data) ఈరోజు రాత్రి వెలువడనుండడంతోపాటు గ్లోబల్‌ మార్కెట్లు సైతం బలహీనంగా ఉండడం మన మార్కెట్లపైనా ప్రభావం చూపింది. దీంతో నిఫ్టీ మరోమారు 24500 పాయింట్ల దిగువకు పడిపోయింది. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌ 96 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడేలో 489 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో క్రమంగా 833 పాయింట్లు పడిపోయింది. 22 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ.. అక్కడినుంచి 139 పాయింట్లు పెరిగింది. 237 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్‌(Sensex) 368 పాయింట్ల నష్టంతో 80,235 వద్ద, నిఫ్టీ(Nifty) 97 పాయింట్ల నష్టంతో 24,487 వద్ద నిలిచాయి.
ఈనెల 15వ తేదీన యూఎస్‌, రష్యా అధ్యక్షుల సమావేశం ఉంది. ఇరు దేశాల మధ్య చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ట్రంప్‌, పుతిన్‌ మధ్య చర్చల ఫలితాలు వెల్లడయ్యాక మార్కెట్‌ గమనం మారే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

అడ్వాన్సెస్‌, డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,068 కంపెనీలు లాభపడగా 1973 స్టాక్స్‌ నష్టపోయాయి. 152 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 114 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 105 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 7 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 1.68 లక్షల కోట్లు తగ్గింది.

మిక్స్‌డ్‌గా సూచీలు..

బీఎస్‌ఈలో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌లు 0.60 శాతం, ఆటో(Auto) ఇండెక్స్‌ 0.58 శాతం, హెల్త్‌కేర్‌ 0.42 శాతం, యుటిలిటీ 0.38 శాతం, ఎనర్జీ 0.37 శాతం, మెటల్‌ ఇండెక్స్‌ 0.36 శాతం, ఐటీ ఇండెక్స్‌ 0.28 శాతం మేర లాభపడ్డాయి. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(Financial services) 0.86 శాతం, బ్యాంకెక్స్‌ 0.83 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.76 శాతం, రియాలిటీ 0.75 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్స్‌ 0.51 శాతం, టెలికాం 0.46 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.44 శాతం నష్టపోయాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.04 శాతం లాభపడగా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.35 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు 0.25 శాతం నష్టపోయాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 12 కంపెనీలు లాభాలతో, 18 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. మారుతి 2.06 శాతం, టెక్‌ మహీంద్రా 1.90 శాతం, ఎంఅండ్‌ఎం 1.66 శాతం, ఎన్టీపీసీ 1.16 శాతం, సన్‌ఫార్మా 0.91 శాతం లాభాలతో ముగిశాయి.

Top Losers : బజాజ్‌ ఫైనాన్స్‌ 2.87 శాతం, ట్రెంట్‌ 1.36 శాతం, హెచ్‌యూఎల్‌ 1.35 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.31 శాతం, ఎటర్నల్‌ 1.10 శాతం నష్టపోయాయి.

Must Read
Related News