అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock markets | అమెరికా(America) విధించిన అదనపు సుంకాలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. బ్యాంక్(Bank), ఫార్మా, మెటల్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, బీఈఎల్, హిందాల్కో వంటి స్టాక్స్ సూచీలను వెనక్కి లాగుతున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ (Sensex) 258 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 437 పాయింట్లు క్షీణించింది. 68 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ అక్కడినుంచి 144 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తుండడంతో నష్టాలు స్వల్పంగా తగ్గాయి. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 528 పాయింట్ల నష్టంతో 81,107 వద్ద, నిఫ్టీ(Nifty) 161 పాయింట్ల నష్టంతో 24,806 వద్ద కొనసాగుతున్నాయి.
Stock markets | ఎఫ్‌ఎంసీజీ, ఆటో స్టాక్స్ మినహా..
ఎఫ్‌ఎంసీజీ(FMCG), ఆటో సెక్టార్లు మినహా మిగిలిన అన్ని రంగాల స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ సూచీ 0.37 శాతం, ఆటో ఇండెక్స్ 0.07 శాతం పెరిగాయి. ఐటీ ఇండెక్స్ ఫ్లాట్‌గా ఉంది. టెలికాం(Telecom) ఇండెక్స్ 1.69 శాతం, రియాలిటీ ఇండెక్స్ 1.43 శాతం, క్యాపిటల్ మార్కెట్ 1.40 శాతం, మెటల్ 1.30 శాతం, హెల్త్‌కేర్ 1.17 శాతం, ఇన్‌ఫ్రా 1.05 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.04 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ ఒక శాతం నష్టంతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్(Small cap index) 1.03 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.77 శాతం, లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 0.62 శాతం నష్టంతో సాగుతున్నాయి.
Stock markets | Gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 5 కంపెనీలు లాభాలతో ఉండగా.. 25 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. హెచ్‌యూఎల్ 1.46 శాతం, మారుతి 0.72 శాతం, టీసీఎస్ 0.16 శాతం, ఐటీసీ 1.44 శాతం, ఇన్ఫోసిస్ 0.07 శాతం లాభాలతో ఉన్నాయి.
Stock markets | Top losers..
సన్‌ఫార్మా 2.46 శాతం, టాటా స్టీల్ 1.66 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.55 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.38 శాతం, బీఈఎల్ 1.33 శాతం నష్టంతో ఉన్నాయి.